ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
By Ram Reddy
On
రాజాపూర్ లోకల్ గైడ్ :
79వ, స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజాపూర్ మండలోని చోక్కంపేట్ గ్రామంలోఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నరిగె యాదయ్య గ్రామ సచివాలయం ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర పంద్రాగస్టు వేడుకలలో మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల వల్ల మనకు ఇదే రోజున 15/08/1947న స్వాతంత్ర్యం అర్ధరాత్రి లభించిందని దాని ఫలితంగానే ఈరోజు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని స్వాతంత్ర్యం అన్ని కులాలవారు అన్ని మతాలవారు కలిసి పోరాడితేనే వచ్చిందని కాకపోతే స్వాతంత్ర్యం అనేది కొంతమందికి అగ్రకులాలకు మాత్రమే పరిమితమైందని అట్టడుగు ప్రజల వారికి అంటే బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాలేదని యాదయ్య అన్నారు. అధికారం అంతా కేవలం అగ్రకులాల వారి చేతుల్లోనే ఉంది యువకులు అందరూ రాజకీయంగా కూడా అన్ని రంగాలలో రాణించాలని కోరారు. కుల మతాలు లేని సమాజం నిర్మాణం జరిగితే అప్పుడు అందరికి స్వాతంత్రం వచ్చినట్లు అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రెటరీ జైపాల్, దోండ్లపల్లి యుపిఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, మాజీ కోఆప్షన్ నెంబర్ ఎండి అజిముద్దీన్, మాజీ ఉప సర్పంచ్ నీలమ్మ, వార్డు మెంబర్ మంచాల నర్సింలు, మంచాల మల్లేష్, ఫీల్డ్ అసిస్టెంట్ యాదయ్య, కుమ్మరి శివకుమార్, ఆవులమంద గణేష్, డీలర్ ఆంజనేయులు, ఫీల్డ్ అసిస్టెంట్ యాదయ్య, టిఆర్ఎస్ గ్రామ ప్రెసిడెంట్ ఆవులమంద యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
16 Aug 2025 09:49:06
https://youtu.be/-q66o0X_PAw?si=cTCR02yZyVGpw_vGhttps://youtu.be/-q66o0X_PAw?si=cTCR02yZyVGpw_vG