ఘనంగా పల్లా వీరాభిమాని జన్మదిన వేడుకలు

జనగామ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ప్రజలకు నిత్యం అందుబాటులో

ఘనంగా పల్లా వీరాభిమాని జన్మదిన వేడుకలు

జనగామ జిల్లా లోకల్ గైడ్ ప్రతినిధి):-

పల్లా వీరాభిమాని మహమ్మద్ యాకుబ్ పాషా  జన్మదిన సందర్భంగా జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ని శుక్రవారం హైదరాబాద్ లో కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. జనగామ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, ఇచ్చిన మాట ప్రకారం ఉచిత వైద్యం అందిస్తూ, కాలికి గాయం అయినప్పటికీ అభివృద్ధి లక్ష్యంగా ఎనలేని సేవలు అందిస్తున్న పల్లా సార్‌పై ఉన్న అపారమైన అభిమానంతో “పల్లా తో మా పయనం” అనే పాటను వారు సొంతంగా. వ్రాయించి. పాడించి. వారు కూడా ఈ పాటకు కోరస్ అందించడం జరిగింది ఈ పాటను  పల్లా  చేతుల మీదుగా  ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ధర్మపురి శీను, జనగామ పట్టణ మైనార్టీ అధ్యక్షులు సలీం. సీనియర్ నాయకులు అబ్బాస్, జనగామ మండల మైనార్టీ అధ్యక్షులు యాకుబ్ పాషా, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదారాజు చందు, జనగామ సోషల్ మీడియా ఇంచార్జ్ తుంగ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News