ఫార్మాస్యూటికల్ పరిశోధనలో సీహెచ్.భార్గవికి పీహెచ్డీ

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో సీహెచ్.భార్గవికి పీహెచ్డీ

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పార్కిన్సన్స్ డ్రగ్ డెలివరీలో సంచలనాత్మక పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని చెక్కిళ్ల భార్గవిని డాక్టరేట్ వరించింది. నాసిక లోపల పంపిణీ కోసం సూక్ష్మవాహకాల మోతాదు సూత్రీకరణ, మూల్యాంకనంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రఘువీర్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలకమైన సవాలును డాక్టర్ భార్గవి పరిశోధన పరిష్కరిస్తుందని తెలిపారు. రక్త-మెదడు అవరోధం (బీబీబీ) అంతటా ప్రభావవంతమైన ఔషధ పంపిణీ, డోపమైన్ అగోనిస్ట్ అయిన పిరిబెడిల్ యొక్క ఇంట్రానాసల్ డెలివరీ కోసం నానోస్ట్రక్చర్డ్ లిపిడ్ క్యారియర్లను (ఎన్ఎల్సీ) అభివృద్ధి చేయడం ద్వారా ఆమె అధ్యయనం మెరుగైన ఔషధ ద్రావణీయత, పారగమ్యత, చికిత్సా సామర్థ్యాన్ని ప్రదర్శించిందన్నారు. అధునాతన క్వాలిటీ బై డిజైన్ (క్యూబీడీ) పద్ధతులను ఉపయోగించి ఆప్టిమైజ్ చేసిన నూతన నానోసస్పెన్షన్, అండ్ సాలిడ్ లిపిడ్ నానో పార్టికల్స్ మెరుగైన మ్యూకోఅథెషన్, స్థిరత్వాన్ని చూపించడంతో పాటు సాంప్రదాయ పద్ధతులకు ఆశాజనకమైన నాన్-ఇన్వాసివ్ ప్రత్యామ్నాయాన్ని అందించినట్టు తెలిపారు.
అధిక ఎన్ క్యాప్సులేషన్ సామర్థ్యం, నియంత్రిత విడుదల ద్వారా వర్గీకరించిన ఆమె సూత్రీకరణలు స్థిరమైన రక్తసాంద్రత, తగ్గిన దైహిక దుష్ర్పభావాలతో ఇన్ విట్రో, ఎక్స్ వివో ఫలితాలను కూడా సాధించాయన్నారు. ఇది క్లినికల్ అప్లికేషన్ కు ఉపకరిస్తుందని తెలియజేశారు. డాక్టర్ భార్గవి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మైలురాయి డాక్టర్ భార్గవి అంకితభావం, శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రతిబింబించడ మే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఆరోగ్య సంరక్షణలో పరివర్తన పరిశోధన, ఆవిష్కరణలకు గీతం నిబద్ధతను ప్రతిబింబిస్తోందన్నారు.

Tags:

About The Author

Latest News