ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన సన్మానం
నారాయణ పేట,మార్చి 1:
నారాయణపేట జిల్లా కేంద్రం అంబేద్కర్ భవన్ లో మున్సిపాలిటీ కి నూతనంగా ఎన్నికైన ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లను అంబేద్కర్ జాతర కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు.9 వవార్డు కౌన్సిలర్ యు మహేష్ ,5వ వార్డు కౌన్సిలర్ రాఘవేంద్ర,,పడవ వార్డు కౌన్సిలర్ జయశ్రీ లను అంబేద్కర్ జిల్లా జాతర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భం గా జిల్లా జాతర కమిటీ సభ్యులు ఈశ్వరమ్మ టి మాధవ్,చంటి చిన్ని కృష్ణ తదితరులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ఆ యా వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ ఆశయాల కోసం కృషి చేయాలని జాతర కమిటీ తరఫున సూచించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ మమ్మల్ని సన్మానించిన జిల్లా జాతర కమిటీ కి ప్రత్యేకంగా ధన్యవా దాలు తెలిపారు.మా వంతు ఏ అవసరమొచ్చిన సంఘా నికి అందుబాటులో ఉంటామ ని వారు తెలిపారు.ఈ కార్యక్ర మంలో ఆజమ్మ, నాగమ్మ, హన్మంతు,గోపి పాండు, టి.హన్మంత్,అరుణ్, వెంకటేష్,నరసింహ,శివ,బాబు,తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:1.ఎస్సీ,ఎస్టీ కౌన్సిలర్లకు సన్మానం
_____________________
