రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.

ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై విమల హెచ్చరిక.

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.

లోకల్ గైడ్/బంట్వారం:

బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల మీ బ్యాంక్ రివార్డు పాయింట్లు గడువు ముగియబోతున్నాయి పాయింట్లను నగదుగా మార్చుకోండి వంటి సందేశాలు వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా పంపిస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు తెరలేపుతున్నారని తెలిపారు. ఆ సందేశాల్లో ఉన్న లింకులను క్లిక్ చేయించి, APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయించుకుని మొబైల్ ఫోన్‌లలోకి చొరబడి బ్యాంక్ ఖాతాల నుండి డబ్బులు కాజేస్తున్నారని వివరించారు.ప్రజలు ఇటువంటి ఫేక్ మెసేజ్‌లను నమ్మవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ OTPలు, బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్ నంబర్లు పంచుకోవద్దని ఎస్సై విమల సూచించారు.ఏవైనా అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చిన పక్షంలో సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు.ప్రజల అప్రమత్తతతోనే సైబర్ మోసాలను అరికట్టగలమని ఎస్సై విమల, స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు