పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

ఎస్పీ డాక్టర్ వినీత్.

పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

నారాయణపేట మార్చి 1:
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఈ నెల రోజుల పాటు "30 పోలీస్ ఆక్ట్" అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్‌ ఒక ప్రక టనలో తెలిపారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 30 పోలీస్ ఆక్ట్  మార్చ్ 31వ తేది వరకు అమల్లో ఉన్నందు న జిల్లాలో పోలీసు అధికా రుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావే శాలు, ఊరేగింపులు, ధర్నా లు వంటి కార్యక్రమాలు, బహి రంగ సభలు, ప్రజలు గుమ్మి గుడి ఉండే విధంగా కార్య క్రమాలు నిర్వహించ డానికి సన్నాహాలు చేయరాదని తెలిపారు. అనుమతులు లేకుండా పై కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులపై  చట్టపరమైన చర్యలు తప్ప వని తెలిపారు. ప్రజా జీవ నానికి ఇబ్బంది కలిగించేందు కు దారి తీసే సమావేశాలు, జన సమూహం చేయడం పూర్తిగా నిషేధమని తెలి పారు. సోషల్ మీడియా నందు అనవసరమైన విష యాలను, మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులను నమో దు చేయబడతాయని తెలి పారు. చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 30 పోలీస్ ఆక్ట్ ప్రకారం శిక్ష అర్హులవుతారని తెలిపారు. నిషేధం లో ఉన్న నిబంధనలు తప్పనిసరిగా అందరూ పాటించాలని ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాల న్న ముందస్తు దరఖాస్తు చేసుకునీ అనుమతులు తీసుకోవాలని సూచించారు.
ఫోటో రైట్ అప్:2.ఎస్పి.వినీత్
______________________

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు