శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ప్రధాన కార్యదర్శిగా సింగం పవన్ కుమార్ ఎన్నిక
By Ram Reddy
On
మేడ్చల్ జిల్లా, మూడు చింతలపల్లి : లోకల్ గైడ్ :
మూడుచింతలపల్లి మున్సిపాలిటీ లక్ష్మాపూర్ పరిధిలోని రాములగుట్ట ప్రాంగణంలో ఆదివారం రాములగుట్ట కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. శ్రీరాములగుట్ట ప్రస్తుత కమిటీ పదవికాలం ముగియడంతో ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించగా 25 వేలు డిపాజిట్ చెల్లించి, ఆరుగురు పోటీపడగా డ్రా పద్దతిలో ఎన్నిక నిర్వహించారు. కౌన్సిలర్ భర్త చిన్నలచ్చ శ్రీనివాస్ చేత డ్రా తీయించగా డ్రాలో చిత్తయ్య గౌడ్ పేరు వెళ్లడంతో అయనను అధ్యక్షునిగా ప్రకటించారు. అనంతరం మిగతా పదవులకు జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా మాడబోయిన సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా సింగం పవన్ కుమార్, కోశాధికారిగా లగిశెట్టి అరుణ్, సంయుక్త కార్యదర్శిగా తోట ప్రవీణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల నిర్వాహకులుగా తమ్మలి నాగరాజు పంతులు వ్యవహారించారు. నూతనంగా ఎన్నికైన కమిటీని గ్రామ పెద్దలు, యువకులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపి సింగం సత్యనారాయణ, మాజీ సర్పంచ్ సింగం ఆంజనేయులు,మాజీ ఎంపీటీసీ పారుపల్లి నాగరాజు, మాజీ ఉపసర్పంచులు కటికెల వైద్యనాధ్, మాడబోయిన రామకృష్ణ , పెద్దలు సింగం జైహింద్, బండి జగన్నాధం, క్యాతం మధుక్రిష్ణ, కిసరి నర్సిములు, కటికెల వెంకటస్వామి, యువ నాయకులు బండి రవీందర్, శంకర్, బాలేష్, గోపి, సాయి శ్రీనివాసచారి, శ్రీశైలం, కరుణాకర్, వంశీ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
01 Mar 2026 20:33:40
లోకల్ గైడ్/బంట్వారం:
బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
