ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  

ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  


ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్ : ఫిబ్రవరి 1 : 
సింగరేణి మండల  కేంద్రంలో  సినిమా  హల్ సెంటర్  ఎం ఆర్ పీ ఎస్  గద్దె  వద్ద  ఆదివారం  ఎస్ సీ వర్గీకరణ పోరులో  పశువులు  బాసిన మాదిగ   అమరవీరులకు  జోహార్  అర్పించడం జరిగింది. కార్యక్రమం  గ్రామ  శాఖ అధ్యక్షులు  ఆదెర్ల రామారావు, కుల  పెద్ద  ఆదేర్ల అంజయ్య ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ  జిల్లా  నాయకులు ఇమ్మడి  తిరుపతిరావు హాజరై అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పోరులో పశువులు బాసిన మాదిగ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వారి ప్రాణ త్యాగం వృధా కాకుండా ఎస్సీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరారు. అమరవీరుల త్యాగం వృధా కాదని వారి ప్రాణ త్యాగాలు గుర్తుంచుకొని ఎస్సీ వర్గీకరణకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నాగేంద్రబాబు, కుల పెద్ద ఆదేర్ల అంజయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు రామారావు, జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, ఆదేర్ల ఉపేందర్, గజ్జల శ్రీను, అంజయ్య, ప్రసాద్, సాంబ, మహిళ నాయకురాలు అరుణ, గురువమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు