ఏఎంసీ డైరెక్టర్ బందెప్ప మృతి బాధాకరం
- మంచి కార్యకర్తను కోల్పోయాము.
అందరినీ ఆప్యాయతగా పలకరించేవాడు. - కోట్ పల్లి ఏఎంసీ చైర్మన్ అంజయ్య.- బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం.
లోకల్ గైడ్/ తాండూర్:
మార్కేట్ కమిటీ డైరెక్టర్ బంధెప్ప మృతి బాధాకరమని కోట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.శనివారం పెద్దేముల్ మండల పరిధిలోని ఇందూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త,కోటపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జెట్టిగాల బంధెప్ప(38) ఇటీవల అనారోగ్యానికి గురై తాండూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం తెల్లవారుజామున 4గంటలకు ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో బందెప్ప మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కోటపల్లి ఏఎంసి వైస్ చైర్మన్ నారాయణరెడ్డి బందెప్ప మరణ వార్తను తెలుసుకొని,కుటుంబాన్ని సందర్శించి ఆయన మృతదేహానికి పూలదండ వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా మృతుడి కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సహాయన్ని తనవంతుగా ఆయన అందజేశారు.ఈ నేపథ్యంలో ఇందూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్....బందెప్ప కుటుంబానికి అవసర నిమిత్తం రూ.10వేల సహాయన్ని కుటుంబ సభ్యులకు అందించి,మృతుడి కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు నారాయణరెడ్డి మాట్లాడుతూ... మేము ఎప్పుడు కలిసినప్పుడల్లా చాలా పద్ధతిగా, వినయంగా పలకరించేవాడు.బందెప్ప చనిపోయాడు అని తెలియగానే మా అందరి హృదయాలను కలచివేసింది.బందెప్ప కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకునేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని వైస్ చైర్మన్ నారాయణరెడ్డి కుటుంబానికి భరోసానిచ్చారు.