కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేయడం.
తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి కేశంపేట మండలం మాజీ జెడ్పిటిసి.
23వ మరియు 24వ వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు అగ్గనూరు బస్వం మరియు విశాల విశ్వంలకు ప్రజల నుండి భారీ మద్దతు.
*
లోకల్ గైడ్ తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా షాద్నగర్ లోని 23వ మరియు 24వ వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు అగ్గనూరు బస్వం మరియు విశాల విశ్వంల ను గెలిపించాలని ఓటర్ మహాశయులను అభ్యర్థిస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన మాజీ జెడ్పిటిసి విశాల మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు. ఈ సందర్భంగా వార్డు వ్యాప్తంగా ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు.
వార్డులోని వివిధ కాలనీల్లో పర్యటించి ప్రజలతో మమేకమై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని, ప్రజల విశ్వాసమే తమకు అసలైన బలమని వారు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ దశలవారీగా పరిష్కారాలు చూపుతామన పేర్కొన్నారు.
