రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఆటో అడ్డాలకు స్థలాలు కేటాయించి ప్రమాద బీమా రూ 10 లక్షలు ఇవ్వాలి..
By Ram Reddy
On
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 రవాణా చట్టం రద్దు చేయాలి.. మద్దాల ప్రభాకరరావు సీఐటీయూ జిల్లా నాయకులు..
రవాణా రంగ పరిరక్షణ కార్మిక హక్కుల సాధనకై ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ఇతర కార్మిక సంఘాలు పిలుపులో భాగంగా రవాణా రంగంలో ఆటో,ట్రాలీ,క్యాబ్, డీసీఎం లారీ,స్కూల్ బస్సు,అంబులెన్స్,ట్రాక్టర్స్, మెకానిక్స్,ఆపరేటర్స్ తదితరులు ఈనెల 12న జరుగుతున్నా జాతీయ సమ్మెలో జయప్రదం చేయాలని ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామం ఆటో యూనియన్ కు సీఐటీయూ జిల్లా నాయకులు మద్దాల ప్రభాకర్.పిలుపునీచ్చారు. ఈ సందర్బంగా మద్దాల ప్రభాకరరావు. మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆటో, రవాణా కార్మికుల ఇచ్చిన హామీని అమాలు చేయాలనీ రవాణా రంగంలో ఆటో కార్మికులు ఎంతో కీలకపాత్ర వహిస్తున్నారని ఇదే ఆటో,రవాణా కార్మికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటు కిస్తీలు కట్టలేక ఫైనాన్స్ కట్టలేక ఆటోలను అమ్ముకొని రోడ్డున పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎంతోమంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడం దుర్మార్గమని ఆయన అన్నారు..ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ప్రతి ఆటో,రవాణా కార్మికునికి సంవత్సరానికి 12,000 జీవన భృతి వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఒక పక్క డీజిల్ పెట్రోల్ నిత్యవసర వస్తువులు బీమా ప్రీమియం మొదలైన ఖర్చులు బాగా పెరిగి కిరాయిలు లేక ఇబ్బంది పడుతుంటే సర్వీస్,ట్రాన్స్పోర్ట్ ఆటో,రిక్షాలకు సరిపడా పార్కింగ్ స్థలాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కానీ అలా చేయడంలో ఘోరంగా విఫలమయ్యి ప్రభుత్వా తప్పిదానికి డ్రైవర్లు అనాధికారిక స్థలాలలో వాహనాలు ఆపారనే సాకుతో ఇది పెద్ద నేరంగా పరిగణిస్తూ బారి జరీమానాలతో,అక్రమా చలాన్లు విధిస్తూ ప్రభుత్వ అధికారులు కార్మికుల సొమ్మును కొల్లగొడుతున్నారు.పోలీసులు,ఆర్ టి ఎ వేదింపులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిన ఇప్పటివరకు రవాణా రంగ కార్మికుల పట్ల వారి జీవన భృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన లేక ఆటో,రవాణా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో కార్మికులకు జీవన భృతి చెల్లించినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో జీవన భృతి ఎందుకు చెల్లించరని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. ఆటో కార్మికుల ప్రయాణం మొత్తం రోడ్డుమీదనే ఉండటంవల్ల వారి యొక్క జీవనం ప్రశ్నార్థకంగా మారిందని వారి సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఒక సమగ్ర చట్టం చేయాలని ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు.రవాణా రంగ కార్మికులకు గుది బండగ మారిన 2019 మోటార్ వాహనాల చట్టాన్ని రద్దు చేయాలని బి ఎన్ ఎస్ సెక్షన్ 106)(2)&(3) ను ఉపసంహరించుకోవాలని రవాణా రంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనీ ప్రమాద బీమా రూ.10 లక్షలు ఇవ్వాలనీ ఈఎస్ఐ,పిఎఫ్ చట్టాలను సవరించి రోడ్డు రవాణా కార్మికులందరికీ వర్తించేలా చేయాలనీ ప్రభాకర్ ఈ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమలో షేక్ నాగుల్ మీరా, పండ్, నాగేశ్వరావు,తదితరులు,పాల్గొన్నారు..
Tags:
About The Author
Related Posts
Latest News
10 Feb 2026 20:09:04
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)
జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము. వారు తమ ఓటు...
