నల్లగొండ మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో జిల్లా అంతటా కట్టుదిట్టమైన నాకాబంది, విస్తృత తనిఖీలు. 

అక్రమంగా తరలిస్తున్న 4.9 కేజీల వెండి, 24 బీర్ బాటిల్ల మద్యం, 64 చీరలు,ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం.

నల్లగొండ మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో జిల్లా అంతటా కట్టుదిట్టమైన నాకాబంది, విస్తృత తనిఖీలు. 

నల్లగొండ  జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ . 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. ఫిబ్రవరి 10. (లోకల్ గైడ్).

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్  ఆదేశాలు, ప్రత్యక్ష పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన నాకాబంది, విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్వయంగా పట్టణంలోని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జీలు, హోటళ్లు, రద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. చెక్‌పోస్టులు, పోలీస్ నాకాబంది, వాహన తనిఖీలు, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నాకాబంది నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తులు, వాహనాలపై విస్తృత తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.తనిఖీలలో అక్రమంగా తరలిస్తున్న 4.9 కేజీల వెండి, 24 బీర్ బాటిల్ల మద్యం, 64 చీరలు,ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకుని సంబంధిత వారిపై కేసులు నమోదు చేస్తూ కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌కు ముందు , పోలింగ్ పూర్తయ్యే వరకు సైలెంట్ పీరియడ్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కాలంలో ఎలాంటి ప్రచారం, సభలు, ర్యాలీలు, మైకుల వినియోగం, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.అక్రమ నగదు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల తరలింపుపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని, పట్టుబడితే ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లాడ్జీలు, హోటళ్లలో అక్రమంగా తలదాచుకునే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమాలను తప్పనిసరిగా పాటించాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.
నల్లగొండ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, భద్రంగా జరిగేలా పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News

గూడూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గూడూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
లోకల్ గైడ్ కొత్తూరు. ప్రజాపాలనలో ప్రజలకు పలు సంక్షేమ,అభివృద్ధి ఫలాలు అందిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం కొత్తూరు మండలంలోని గూడూరులో రూ.23 లక్షలతో సిసి...
పేదల కళ్లల్లో ఆనందమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం.
జే.ఎల్ సంఘం డైరీ ఆవిష్క రణ 
టేబుల్ టెన్నిస్‌లో వరంగల్‌కు స్వర్ణం!
పేదోడి సొంతింటి కళ కాంగ్రెస్ తోనే సాధ్యం.
వృద్ధుల పోషణ విస్మరిస్తే జైలు కే 
పంచాయతీ కార్మికుడి మృతి బాధాకరం.