శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.
తరచూ ప్రమాదాలు కూడ జరుగుతున్నాయని ఇన్స్పెక్టర్ సి హెచ్ రాజుకు వివరించారు.
రాజేంద్ర నగర్ ఫిబ్రవరి 10, (లోకల్ గైడ్ ): శివరాంపల్లి పీవీ ఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 274 వద్ద నిత్యం ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్య ను పరిష్కరించాలని ఐక్యత వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మంగళవారం రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసులకు ఫర్యాదు చేశారు. ఇక్కడ బస్టాప్ ఉండటంతో పాటు యూ టర్న్ కూడా ఉండటం నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, దీని వల్ల తరచూ ప్రమాదాలు కూడ జరుగుతున్నాయని ఇన్స్పెక్టర్ సి హెచ్ రాజుకు వివరించారు. అదే విధంగా పిల్లర్ నెంబర్ 271 నుంచి 277 వరకు సర్వీస్ రోడ్డులో వ్యాపార సముదాయాలకు వచ్చే వాహనదారులు రోడ్ల పైనే అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేస్తుండటం ట్రాఫిక్ సమస్యతో కాలనీ వాసులకు, ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారికి ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు. పుట్ పాత్ వ్యాపారుల వల్ల చాలా సమస్య ఉత్పన్నమవుతుందని అసోసియేషన్ అధ్యక్షులు పి. వెంకటేష్, ఉపాధ్యక్షులు డి ఆంజనేయులు, కార్యదర్శి ఎస్. శ్రీనివాస్, గణేష్ లు ఇన్స్పెక్టర్ కు వివరించారు. పలుమార్లు ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా వ్యాపారస్తులకు చెప్పిన పట్టించుకోవడంలేదని తెలిపారు. సమస్యను విన్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్న ప్రాంతాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు.
