ఓటర్ నమోదు వేగవంతానికి బూత్ లెవెల్ ఏజెంట్లు వెంటనే నియమించాలి:
కలెక్టర్ హేమావతి
By Ram Reddy
On
సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)
మార్చి24:సిద్ధిపేట జిల్లాలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు వెంటనే బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె. హేమావతి సూచించారు.
మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటరు నమోదు ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకమని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలంటే ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేయడం అవసరమని అన్నారు.2002 మరియు 2025 ఓటర్ జాబితాలను సరిపోల్చి కొత్త ఓటర్ల నమోదు, తొలగింపుల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తక్షణమే బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని తెలిపారు.
అలాగే శాసనసభ నియోజకవర్గాల వారీగా బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకుడు మోహన్ లాల్, బీజేపీ భైరీ శంకర్, కాంగ్రెస్ అనిల్ కుమార్, ఎఐఎంఐఎం మునీర్, ఎలక్షన్స్ సూపరింటెండెంట్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
06 Apr 2026 20:55:56
చర్ల : లోకల్ గైడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లం పరిధిలో ఉన్న ఆర్ కొత్తగూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచ్ తుర్రం రవికుమార్,...
