అభివృద్ధే మా లక్ష్యం ప్రజల రక్షణే మాధ్యేయం
ఆర్ కొత్తగూడెం సెక్రటరీ సర్పంచ్ లకు ఘనంగా శాలువాతో సత్కరించిన గ్రామ ప్రజలు
చర్ల : లోకల్ గైడ్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లం పరిధిలో ఉన్న ఆర్ కొత్తగూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచ్ తుర్రం రవికుమార్, ఉపసర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, పంచాయతీ కార్యదర్శి శోభారాణి సంయుక్తంగా విశేష కృషి చేసారు. ఇందుకు గ్రామ ప్రజలు సోమవారం శాలువాతో వారిని ఘనంగా సత్కరించారు. గ్రామంలోని ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు ఉండాలనే లక్ష్యంతో ఉపాధి హామీ (ఎం జీ ఎన్ ఆర్ ఈ జీ ఎస్) నిధులతో ఇప్పటికే 11 సిమెంట్ రోడ్లను నిర్మించారు. ఇందులో ఐతం రాజు ముత్తమ్మ ఇంటి నుండి మల్లం నర్సింహ ఇంటి వరకు గుంతలతో విపరీతం ఇబ్బంది పడుతున్న ప్రజలకు సుమారు 103 అడుగుల సిమెంట్ రోడ్ వేయటం విశేషం. అదనంగా పంచాయతీ నిధులతో మరో రెండు రోడ్ల పనులను పూర్తి చేసి, గ్రామ రవాణా సౌకర్యాలను మెరుగుపరిచారు. గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, నిరంతరం పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీధి దీపాల ఏర్పాటు ద్వారా గ్రామాన్ని వెలుగుల మయం చేస్తూ, ప్రజలకు సురక్షిత వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఈ మార్పులతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. దశాబ్దాలుగా ఉన్న రోడ్ల సమస్యలు తీరడం, గ్రామం శుభ్రంగా మారడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేసి, గ్రామ ప్రాముఖ్యతను పెంచడంతో పాటు, పంచాయతీకి శాశ్వత ఆదాయ వనరులను సమకూర్చే దిశగాచర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గ్రామంలో వారపు సంత ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల నిర్వహించిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ సభలో సర్పంచ్ రవికుమార్, కార్యదర్శి శోభారాణి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి సంత అవసరాన్ని వివరించి, అవసరమైన అనుమతుల కోసం వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వార్డు సభ్యుడు కారం సుధాకర్ అందిస్తున్న సహకారాన్ని సర్పంచ్ ప్రత్యేకంగా అభినందించారు. పాలకమండలి, అధికారుల సమన్వయం మరియు ప్రజల మద్దతుతో ఆర్. కొత్తగూడెం గ్రామం అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా మారుతోంది. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
