( లోకల్ గైడ్ షాద్ నగర్)
దేవాలయాలు భక్తి,విశ్వాసం మరియు ఆధ్యాత్మిక శాంతికి నిలయాలని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండల కేంద్రంలో శ్రీ శివ,సీతా రామాంజనేయ స్వామి దేవాలయ నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలు ఆధ్యాత్మిక విలువలను కాపాడే పవిత్ర కేంద్రాలని ఇవి మనసుకు ప్రశాంతతను,జీవనానికి సరైన మార్గాన్ని చూపిస్తాయని దేవాలయంలో చేసే పూజలు దర్శనం ద్వారా మనలో భక్తి, వినయం,మంచి ఆలోచనలు పెరుగుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో కేశంపేట సంతోష శ్రీశైలం,మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి,పోమాల్ పల్లి సర్పంచ్ స్వప్న భూపాల్ రెడ్డి,ఇప్పలపల్లి సర్పంచ్ జంగయ్య,గుట్టలగడ్డ సర్పంచ్ థౌర్యా,మాజీ సర్పంచులు తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి,శేఖర్ పంతులు,యారం శేఖర్ రెడ్డి, కొత్తపేట నవీన్,బల్ రాజ్ గౌడ్, సర్పంచ్ ఆంజనేయులు,ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎంపిటిసి రాంచదర్, కంటెస్టెడ్ సర్పంచులు రామ్ రెడ్డి,సత్యనారాయణ మాజీ ఉపసర్పంచ్ జ్యోతి నరేందర్ రెడ్డి,నాయకులు జగన్ రెడ్డి, క్రిష్ణ,నరేందర్.జి,రామకృష్ణ హన్మంత్,శ్రీను,సాజీద్, శేఖరయ్య,రతన్ నాయక్, దశరథమ్,ప్రవీన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.