రాయపోల్,దౌల్తాబాద్ మండలాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
గురుకులం, ఆసుపత్రి, తహసీల్దార్ కార్యాలయాల్లో లోపాలపై ఆగ్రహం
By Ram Reddy
On
సిద్ధిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)
గృహంలో మరుగుదొడ్లు నిర్మించాలని ప్రిన్సిపల్ విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారు. ఈడబ్ల్యూఐడిసి అధికారులతో ఎస్టిమేట్ తయారు చేయించి త్వరలోనే నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.విద్యార్థుల క్రమశిక్షణ, ప్రవర్తన నియమావళిని ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని, చదువు, భోజనం, వసతి విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.అనంతరం రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ ఫీల్డ్ విజిట్‌లో ఉన్నట్లు చెప్పగా వీడియో కాల్ ద్వారా నిజనిర్ధారణ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ, ఆసుపత్రి సమయాలను కచ్చితంగా పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు.తరువాత తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, సిబ్బంది హాజరు నమోదు పరిశీలించారు. సమయపాలన పాటించాలని, రిజిస్ట్రేషన్ వివరాలను సమగ్రంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియలో బిఎల్ఓల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు.అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ భూ సేకరణలో మండలంలోని గ్రామాల్లో భూ యజమానులతో చర్చలు జరిపి ఆర్బిటరేషన్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని తహసీల్దార్‌కు ఆదేశించారు.
Tags:
About The Author
Latest News
06 Apr 2026 20:55:56
చర్ల : లోకల్ గైడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లం పరిధిలో ఉన్న ఆర్ కొత్తగూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచ్ తుర్రం రవికుమార్,...
