రాతి రాజగోపురం నిర్మాణానికి భక్తుల భాగస్వామ్యం కోరిన స్వామి
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రం “చిన్న అరుణాచలం” దినదినాభివృద్ధి
By Ram Reddy
On
దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలో శ్రీ శివ నాగరాజు స్వామి స్థాపించిన శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రం “చిన్న అరుణాచలం” దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా ఎదుగుతోంది. ఈ ఆలయం నిత్యం శివనామస్మరణతో మారుమ్రోగుతూ, అనేక మంది భక్తులను ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ఆలయంలో భక్తులకు నిత్యం అన్నదానం నిర్వహిస్తూ శ్రీ శివ నాగరాజు స్వామి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆలయ విశిష్టతను మరింత పెంచాలనే లక్ష్యంతో సుమారు కోటి రూపాయల వ్యయంతో ఐదు అంతస్తుల రాతి రాజగోపురం నిర్మాణానికి స్వామి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం చర్ల మండలం లక్ష్మీ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని జాంబవంతుడి గుట్టలపై ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని స్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాతి రాజగోపురం నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశ్యంతో ఊరు ఊరు తిరిగి బిక్షాటన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరూ తమవంతు సహాయం అందించి ఈ పుణ్యకార్యంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ పూజారి మడకం దేవ, కార్యదర్శి మడకం చందు, కోశాధికారి బీరబోయిన శంకర్, ఉపాధ్యక్షులు బీరబోయిన శేఖర్, వేములపల్లి ప్రవీణ్ కుమార్, మహిళా సభ్యులు బీరబోయిన రాణి, తోలె లక్ష్మీ, కొర్స లక్ష్మి, కొర్స వైష్ణవి, మడకం విజయలక్ష్మి, పూనెం లక్ష్మీ, నక్కా మహాలక్ష్మి, మడకం మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
04 Apr 2026 21:39:31
వెంకటాపురం : లోకల్ గైడ్ :ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామపంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల కోసం ఎలకల రామారావు ఆధ్వర్యంలో టేబుల్,
