ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో కౌన్సిలర్ బరిలో
కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అందే మోహన్ భరోసా కల్పించారు.
/రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం
షాద్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ సహాయ సహకారాలతో 14వ వార్డు కౌన్సిలర్ గా బరిలో ఉంటానని, కాలనీ ప్రజలు ఓటర్లందరూ తనను కౌన్సిలర్ గెలిపిస్తే అభివృద్ధికి మారుపేరుగా ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతారని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అందే మోహన్ భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని, ఈ నేపథ్యంలో షాద్నగర్ మున్సిపాలిటీ 14వ వార్డులో ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. వార్డులోని మహిళలు, పెద్దలు, యువకులు అందరు సహకరిస్తే కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తుందని, రాష్ట్ర నిధులు, అలాగే ఎమ్మెల్యే ద్వారా వచ్చే నిధుల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేందుకు వీలు ఉంటుందని వివరించారు. అవకాశం కల్పిస్తే ప్రజాసేవకు పూర్తిగా అంకితమవుతానని, ప్రజల నమ్మకమే తనకు బలమని స్పష్టం చేశారు. ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నానని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెడతానని, ప్రజలు తనను తమ బిడ్డగా భావించి అన్ని అర్హతలు ఉన్న తన లాంటి వారికి అవకాశం కల్పించాలని వినంబంగా అందె మోహన్ విజ్ఞప్తి చేశారు.
