కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..

గత రెండు రోజులుగా అధికార పార్టీ అభ్యర్థులు వారి పోటీ చేస్తున్న వార్డులలో విస్తృతంగా ప్రచారం

కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ బిఫాం ల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది.జిల్లాలోని ఉన్న నాలుగు మున్సిపాలిటీలలో అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించింది గత రెండు రోజులుగా అధికార పార్టీ అభ్యర్థులు వారి పోటీ చేస్తున్న వార్డులలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు.కానీ బెల్లంపల్లి మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాం తమ బీఫాంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎప్పుడు ఇస్తారని క్యాంపు కార్యాలయం వద్ద పడికాపులు కాస్తున్నాడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.కాగా కొంతమంది అభ్యర్థులు మాత్రం తమను అదినాయకులు ర్యాగింగ్ చేస్తున్నారని నిరుత్సాహంతో క్యాంపు కార్యాలయం ఎదుటే పడిగాపులు కాస్తుండడం విశేషం. జిల్లాలోనే కాకుండా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురవలేదని గతంలో పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థులు క్యాంపు కార్యాలయం వద్ద చర్చించుకుంటున్నారు.అయితే బీఫాంలో రాకపోతే తమకున్న సమయాన్ని వినియోగించుకుని మరో పార్టీ నుండి బీఫాం లు పొంది పోటీ చేసేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ బీఫాంలు సరైన సమయానికి ఇవ్వకుండా జంపు జిలానిలను కాపాడేందుకే ఎమ్మెల్యేతో పాటు ఆయన పీఏలు ఎత్తుకు వేస్తున్నారని తెలుస్తుంది.అయితే కౌన్సిలర్ గా పోటీ చేసే అభ్యర్థులు ఎంతో ఆసక్తితో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు