నారాయణపేట ఫిబ్రవరి 1:
మున్సిపాలిటీ,కార్పొరేషన్ ఎన్నికల తరువాతే చైర్మన్ లను ప్రకటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను ఆదేశించడంతో నారాయణపేట మున్సిపల్ చైర్మన్ గా ప్రకటించబడిన సరిత బట్టాడ్ డైలమాలో పడ్డారని తెలుస్తోంది.అంతకు మించి నామినేషన్లకు ముందే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ హరి నారాయణ బట్టడ్ సతీమణి సరిత బట్టాడ్ ను పార్టీ ఇంఛార్జి మాజీ డిసిసి అధ్యక్షుడు కే.శివకుమార్ రెడ్డి చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు.16 వవార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు.అయితే సి ఎం.రేవంత్ రెడ్డి నిర్ణయంతో అయోమయానికి గురవుతున్నారు.ప్రకటించిన శివకుమార్ రెడ్డి,ఇటు హరి నారాయణ బట్టడ్ ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి అయిందని పార్టీ వర్గాలు గుసగుసలాడు కొంటున్నారు.సీఎం.నిర్ణయానికి ముందే చైర్మెన్ అభ్యర్థిని ప్రకటించడంతో ప్రకటించిన శివకుమార్ రెడ్డి సంజాయిషీ చెప్పుకునే పరిస్థితి నెలకొందని పార్టీ వర్గాలు అంటున్నాయి.కాగా హరి నారాయణ బట్టడ్ తన సతీమణి సరిత బట్టాడ్ ను చైర్మన్ గా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ధారాళంగా డబ్బులు కురిపించినట్లు చెబుతున్నారు.ఇంత ఖర్చు చేసిన సి ఎం. ప్రకటనతో తన సతీమణి సరిత బట్టాడ్ కు చైర్మన్ పదవి దక్కుతుందా అన్న అనుమానాలు హరి నారాయణ బట్టడ్ చుట్టూ అలుముకున్నాయి అని అంటున్నారు.ఇది ఇలా ఉంటే చైర్మన్ పదవిని ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.ఈ కాంగ్రెస్ పరిస్థితి చివరకు ఇక్కడి వరకు పోతుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
______________________