చర్ల సీఐ రాజు వర్మ - ఎస్ఐ నర్సిరెడ్డి చేతుల మీదుగా లోకల్ గైడ్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ .
లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువస్తూ,
By Ram Reddy
On
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను లోకల్ గైడ్ జిల్లా బ్యూరో/చర్ల సామల ప్రవీణ్ ఆధ్వర్యంలో సీఐ రాజు వర్మ, ఎస్ఐ నర్సిరెడ్డిలచే ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ రాజు వర్మ మాట్లాడుతూ లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజలకు, పాలకులకు మధ్య వారధిగా నిలుస్తోందని ప్రశంసించారు. సమాజానికి మేలుచేసే వార్తలను ప్రచురించడంలో ఈ పత్రిక ముందుండడం అభినందనీయమన్నారు. పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిజాయితీగా, ధైర్యంగా వార్తా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. వారి కృషి వల్లే లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రికకు మంచి పేరు వచ్చిందన్నారు. ఎస్ఐ నర్సిరెడ్డి కూడా పత్రిక సేవలను ప్రశంసిస్తూ, ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, అలాంటి బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పత్రిక ప్రతినిధులు, స్థానిక స్వేచ్ఛ ప్రెస్ క్లబ్ కమిటీ జర్నలిస్టులు, స్వేచ్ఛ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు మీ వార్త రమణ, రన్ న్యూస్ విష్ణు, మన సాక్షి గొంతుక అశోక్, నాడునేడు మహేష్ పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
03 Feb 2026 13:42:52
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
