లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన జిల్లా ఎస్ పీ
ప్రజాసేవలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయం : ఎస్ పీ రోహిత్ రాజ్
భద్రాద్రి జిల్లా, కొత్తగూడెం : లోకల్ గైడ్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక 2026 నూతన క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ, లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక ప్రజల సమస్యలను బాధ్యతాయుతంగా వెలుగులోకి తీసుకువస్తూ, సమాజంలో అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. నిజాయితీతో, నిష్పక్షపాతంగా వార్తలను ప్రజలకు అందిస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల సమస్యలను, ప్రజా ప్రయోజనాలను ప్రాధాన్యతగా తీసుకుని కథనాలు ప్రచురించడం వల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతున్నాయని తెలిపారు. మీడియా, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే సమాజంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు. లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జర్నలిస్టులు ఎస్పీ కి కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులోనూ ప్రజాహితానికి కట్టుబడి పనిచేస్తామని వెల్లడించారు. జర్నలిస్టులకు మరింత ఉత్సాహాన్ని అందించిందని లోకల్ గైడ్ తెలంగాణ భద్రాద్రి జిల్లా బ్యూరో సామల ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్యూరో, అశ్వారావుపేట కానిస్టెన్సీ రిపోర్టర్ ఉదయ్ శ్రీ, కారేపల్లి మండల రిపోర్టర్ గడమల్ల సంపత్, తోటి జర్నలిస్ట్ రన్ న్యూస్ జిల్లా స్టాఫర్ పాల్గుణ పాల్గొన్నారు.
