విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలి.
ఇందూర్ గ్రామ సర్పంచ్ వెంకటేష్.
By Ram Reddy
On
విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం.
లోకల్ గైడ్/తాండూర్:
విద్యార్థులకు మధ్యాహ్నం వడ్డించే ఆహారం రుచికరంగా ఉండాలని ఇందూర్ గ్రామ సర్పంచ్ వెంకటేష్ ముదిరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు కృషి చేయాలన్నారు. మార్కుల కోసం కాకుండా సబ్జెక్టు పైన పూర్తి పట్టు సాధించేందుకు గుణాత్మక మార్పులు తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బలరాం, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
27 Feb 2026 20:19:01
భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :చర్ల మండల కేంద్రంలో ఉన్న రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో శుక్రవారం రాహుల్ హై స్కూల్ విద్యార్థులకు కేంద్ర రిజర్వ్...
