మార్చి 1న కరీంనగర్ ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష.
రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎస్సీ అభివద్ధి శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే ఐదు నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సు ప్రవేశ పరీక్షను మార్చి 1వ తేదీ (ఆదివారం) నిర్వహించనున్నట్లు ఎస్సీ అభివద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఏం. నాగైలేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ మరియు పెద్దపల్లి జిల్లాల నుండి దరఖాస్తు చేసుకున్న 532 మంది అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసే సమయంలో అడిగిన నాలుగు వివరాలలో ఏవైనా రెండింటిని మాత్రమే నమోదు చేయాలని, అన్ని వివరాలు నింపితే హాల్‌టికెట్ డౌన్‌లోడ్ కాదని స్పష్టం చేశారు. అభ్యర్థులు పరీక్షకు అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, ఇతర వివరాల కోసం ఎస్సీ స్టడీ సర్కిల్ గౌరవ సంచాలకులు బండ శ్రీనివాస్ (9885218053)ను సంప్రదించాలని కోరారు.
