బాధితులకు భరోసా..110 ఖాతాలు డీఫ్రీజ్..డీసీపీ సాయి మనోహర్
సంతోషం వ్యక్తం చేసిన ఖాతాదారులు
By Ram Reddy
On
సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ టి.సాయి మనోహర్ మాట్లాడుతూ, ఎన్ సిఆర్ పి ద్వారా ఫ్రీజ్ చేసిన ఖాతాలను సవివరంగా పరిశీలించి, లావాదేవీల ధృవీకరణ అనంతరం నిజమైన ఖాతాదారులను గుర్తించి చట్టపరమైన విధానాల ప్రకారం డీ-ఫ్రీజ్ చేశామని తెలిపారు. ఖాతాదారులకు సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులపై అవగాహన కల్పించామని, సైబర్ నేరస్తులపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సైబర్ మోసాల బాధితులు వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల ఆధారంగా అనుమానిత ఖాతాలను తక్షణమే ఫ్రీజ్ చేసి నిధులను రక్షించే చర్యలు తీసుకుంటామ ని తెలిపారు. దర్యాప్తులో భాగంగా ముందస్తు చర్యగా ఫ్రీజ్ చేసిన కొన్ని ఖాతాలు మోసాలకు సంబంధం లేని వ్యక్తులవని గుర్తించి డీ-ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. ఎన్‌ఓసీలు అందుకున్న ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేశారు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930 కు కాల్ చేయాలి. https://www.cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయాలి. బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటిపిలు అపరిచితు లతో పంచుకోవద్దు. అనుమానా స్పద కాల్స్, మెసేజ్‌లు, ఆన్‌లైన్ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలి అని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్ ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు విజయ్ కుమార్, శివప్రసాద్, దుర్గా రామలింగప్రసాద్, రామిరెడ్డి, రాఘవేందర్, మధు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
25 Feb 2026 18:55:38
తొర్రూర్ (లోకల్ గైడ్ )తొర్రూర్ పట్టణంలోని బీఆర్ గార్డెన్ లో నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్ కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో...
