అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు  అధ్యక్షులు దోసకాయల వెంకటేశం

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు  అధ్యక్షులు దోసకాయల వెంకటేశం

 

మేడ్చల్ జిల్లా, మూడు చింతలపల్లి : లోకల్ గైడ్ :
మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధి ఉద్దేమర్రిలో మూడు చింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేశం ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం ఏర్పాటు చేసారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు బురిగల మనితా నరసింహ, గుండాల అనురాధ లేట్ నరసింహ  వారి  ఇండ్ల గృహప్రవేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మార్కెట్ కమిటీ  చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, మూడు చింతలపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు పెద్దిరెడ్డి, శ్రీలత వెంకట్ రెడ్డి, దోసకాయల లత వెంకటేష్, లతా భూపాల్, గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ ముదిరాజ్ హాజరయ్యారు 
వీరితో పాటు మున్సిపల్ నాయకులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి, నేమూరు విష్ణు గౌడ్, శ్రీకాంత్ నాయక్, ఏ లక్ష్మణ్, బాల్ నరసింహ, శ్రావణ్ గుప్తా, గురువయ్య , రాజిరెడ్డి, నాగేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు , కౌన్సిలర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రజల తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన మున్సిపల్ పై ముఖ్యమంత్రి కి ప్రత్యేక దృష్టి ఉన్నదని  చాలాసార్లు తెలిపారు. మున్సిపల్ లో ఇందిరమ్మ ఇండ్లు ఎంతమంది అర్హులు ఉంటే అందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా ప్రత్యేక చొరవ చూపిస్తామని హామీ ఇచ్చారు. అలాగనే ఎస్సీ కాలనీలో అంగన్వాడి స్కూల్ నీ సందర్శించినారు ఈ సందర్భంగా మున్సిపల్ అధ్యక్షులు. కౌన్సిలర్లు మాట్లాడూ తూ అక్కడ అంగన్వాడి టీచర్ మరియు పిల్లలను పిల్లల తల్లులను అడిగి అన్ని వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.  ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా వారి దృష్టికి తీసుకొస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీచర్ అంగన్వాడి పిల్లలు   సంతోషం వ్యక్తపరిచారు.

Tags:

About The Author

Latest News

కమాండెంట్ రితీష్ కుమార్ ఠాకూర్ ఆదేశాలతో  కమాండెంట్ రితీష్ కుమార్ ఠాకూర్ ఆదేశాలతో 
భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :చర్ల మండల కేంద్రంలో ఉన్న రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో శుక్రవారం రాహుల్ హై స్కూల్ విద్యార్థులకు కేంద్ర రిజర్వ్...
విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలి.
మార్చి 1న కరీంనగర్‌ ఎస్సీ స్టడీ సర్కిల్‌ ప్రవేశ పరీక్ష.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు  అధ్యక్షులు దోసకాయల వెంకటేశం
హనుమంతుడు భక్తి,బలం, ధైర్యం మరియు నిస్వార్థ సేవకు ప్రతీక
బూర్గుల సంత ప్రారంభోత్సవానికి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అందే మోహన్ కు ఆహ్వానం.
గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర.