కమాండెంట్ రితీష్ కుమార్ ఠాకూర్ ఆదేశాలతో
ఇన్స్పెక్టర్ మనీష్ కుమార్ ఆధ్వర్యంలో రాహుల్ విద్యార్థులకు ఫినాయిల్ తయారీ శిక్షణ
భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :
చర్ల మండల కేంద్రంలో ఉన్న రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో శుక్రవారం రాహుల్ హై స్కూల్ విద్యార్థులకు కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీ ఆర్ పీ ఎఫ్ 141 బెటాలియన్ సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా కమాండెంట్ రితీష్ కుమార్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ మనీష్ కుమార్ ఆధ్వర్యంలో రాహుల్ విద్యార్థులకు ఫినాయిల్ తయారీ శిక్షణా కార్యక్రమాన్ని కళాభవన్ లో నిర్వహించారు. శిక్షణా కార్యక్రమంలో అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే ఫినాయిల్ తయారు చేసే విధానాన్ని నిపుణులు ప్రత్యక్షంగా వివరించారు. వైట్ ఫినాయిల్ తయారీకి కావాల్సిన రసాయనాలను, నాణ్యతను పెంచే పద్ధతులు, మార్కెటింగ్ నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం సీ ఆర్ పీ ఎఫ్ అధికారులు మాట్లాడుతూ సీ ఆర్ పీ ఎఫ్ కేవలం భద్రతకే పరిమితం కాకుండా, ప్రజల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం ఇలాంటి సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్‌లను నిరంతరం నిర్వహిస్తుందని తెలిపారు. రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం వారు ఈ శిక్షణ కార్యక్రమానికి సహకారం అందించడం పట్ల ప్రిన్సిపాల్ వర్మరాజుకు ధన్యవాదములు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీ ఆర్ పీ ఎఫ్ అధికారులు, శిక్షకులు శంకర రావు, రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం డైరక్టర్ కొసరాజు హరిచరణ్, ఉపాధ్యాయులు బిట్రగుంట క్రాంతి కుమార్, ఎస్ కే ఉస్మాన్, శెట్టి సునీత, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
