కోర్కెలు తీర్చే నైనక్షేత్రంలో బుగ్గ దేవాలయం...

భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగా శివుడి దేవాలయం...

కోర్కెలు తీర్చే నైనక్షేత్రంలో బుగ్గ దేవాలయం...

రెండు కొండల నడుమ బుగ్గ దేవాలయం..

IMG-20260214-WA0101బెల్లంపల్లి (లోకల్ గైడ్)

ఇది ఒక అద్భుతమైన శైవక్షేత్రం. కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుడి నిలయం.తెలంగాణలో 2వ వేములవాడగా ప్రసిద్ధి చెందిన దేవాలయం.భక్తజనుల హృదయాల్లో కొలువై ఉన్న శ్రీ బుగ్గ రాజన్న ఆలయం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని దట్టమైన కన్నాల కీకారణ్యంలో ఈ పురాతన శైవ క్షేత్రం వెలసి ఉంది.నిత్యం భక్తజనుల నీరాజనాలందుకుంటున్నది.స్వయంభుగా వెలసిన ఈ పురాతన మహిమాన్వితమైన శివలింగంపై నిత్యం జలధార ప్రవహిస్తు ఉంటుంది.తెలంగాణలోనే ఇటువంటి అద్భుతమైన సన్నివేశం మరే శైవ క్షేత్రంలోను కనిపించదు.బుగ్గ గర్భగుడిలో దర్శనమిచ్చే ఈ అద్భుత మహిమను కన్నుల నిండా వీక్షించాలన్న కోరికతో భక్తులు ఇక్కడికి కుటుంబాలతో సహా తరలివస్తారు.


గర్భగుడిలో స్వయంభుగా వెలసిన రాతి శివలింగం...

కీకారణ్యంలో ఉన్న ఈ బుగ్గ రాజన్న ఆలయాన్ని గతంలో మహాశివరాత్రి పర్వదినాన మాత్రమే భక్తులు సందర్శించి మొక్కులు చెల్లించుకునేవారు.బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామం నుంచి 4కిలో మీటర్ల పొడవున ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో శివుడు వెలిశాడు.అయితే అటవీ జంతువుల భయంతో భక్తులు శివరాత్రి ఉత్సవాలకే పరిమితమయ్యేవారు.ఇక్కడకు వచ్చే భక్తుల కోర్కెలు నెరవేరుతుండటంతో ఇప్పుడు ప్రతిరోజు వందల సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

బుగ్గ దేవాలయం ప్రత్యేకతలు

తెలంగాణ ప్రాంతంలో శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి శైవక్షేత్రాన్ని రెండవ వేములవాడగా భక్తులు కొలుస్తున్నారు.కాకతీయుల కాలంనాటి ఈ శైవ క్షేత్రం స్వయంభూ గా బుగ్గ ప్రాంతంలో వెలసిందని ప్రచారంలో ఉంది.కాకతీయ రాజులు ఈ శైవ క్షేత్రాన్ని తరచు సందర్శిస్తు అభివృద్ధిపరిచారని చరిత్ర చెపుతున్నది.అత్యంత మహిమలతో కూడిన ఈ శివాలయాన్ని దర్శించి ఇక్కడ కొద్దిసేపు సేద తీరితే మనస్సుకు ఎంతో ప్రశాంతత కలుగుతుందన్న భావన భక్తజనుల హృదయాల్లో నిండుకున్నది.పురాతనమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ శివాలయంలోని గర్భగుడిలో వెలసిన శివలింగంపై త్రిభువనధారిణి అయిన గంగ నిత్యం అభిషేకిస్తు దైవలీలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నది.నిత్యం బ్రహ్మ ముహూర్తంలో నాగిని దేవతార్చనలు జరుగుతాయని పూర్వకాలం నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

రకాల వంటకాలు,నైవేద్యాలతో మొక్కులు

రాజరాజేశ్వరుడిని మదినిండా తలిస్తే ఇట్టే కోరికలు తీరుస్తాడన్న ప్రగాఢ విశ్వాసాన్ని విశ్వాసాన్ని నింపుకొని భక్తులు వివిధ రకాల వంటకాలు,నైవేద్యాలతో ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు.ఏటా మహాశివరాత్రికి 3రోజుల పాటు జరిగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.బెల్లంపల్లి మండలంలోని 7మండలాల భక్తులే కాకుండా మంచిర్యాల,చెన్నూరు,కొమురం భీం ఆసిఫాబాద్,సిర్పూర్ నియోజకవర్గాలతో పాటు కరీంనగర్,వరంగల్,హైదరాబాద్, మహారాష్ట్ర,చత్తీస్ గడ్ ప్రాంతాల నుండి కూడా ఈ శైవ క్షేత్రంని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.

Tags:

About The Author

Latest News