అవయవదానం చేయండి.

మరణించినా జీవించండి....

అవయవదానం చేయండి.

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

అపోహలు వీడి ప్రజలందరు నేత్ర అవయవ దానానికి ముందుకు రావాలని జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ పిలుపునిచ్చారు.బెల్లంపల్లి మండలం బుధ కలాన్ గ్రామంలో నిర్వహించిన మహిళ సమాఖ్య సమావేశంలో జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో సదశయా ఫౌండేషన్ సహకారంతో నేత్ర,అవయవ,శరీర దాన అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా అంగీకార పత్రాలు స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం జనహిత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు  మాట్లాడుతు అన్ని దానాల్లోకెల్ల నేత్ర,అవయవ,శరీర దానం గొప్పదని పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదని,ప్రజలందరు మరణించిన తరువాత నేత్ర,అవయవ,శరీరాలు వృధా కాకుండా దానం చేసి సమాజానికి ఉపయోగపడాలని కోరారు.నేత్ర దానం ద్వారా మరణించిన మన కళ్ళ ద్వారా ఈ ప్రపంచాన్ని చూసే అద్భుత అవకాశాన్ని అందరు ఉపయోగించుకోవాలని కోరారు.నేత్రదానం చేసినపుడు మరణించిన తరువాత 8గంటలలోపు మరణించిన వ్యక్తి కళ్లలోని కార్నియా పొరని మాత్రమే సేకరిస్తారని నేత్ర దానం ద్వారా మరో ఇద్దరు అందులకి చూపు ప్రసాదించి వారి ద్వారా మరణించిన ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం ఉందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.అదేవిదంగా ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వారి అవయవాలు దానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో అవయవాలు అవసరం ఉన్న మరో 8మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని,శరీర దానం ద్వారా పార్థివ దేహాన్ని వైద్య కళాశాలకు అందించి కొన్ని వేల వైద్య విద్యార్థుల బోధనకు ఉపయోగపడి ప్రజల వైద్య చికిత్సలకు ఉపయోగపడే అవకాశం ఉందని తెలిపారు.ప్రజలందరు అపోహలు వీడి నేత్ర,అవయవ,శరీర దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బూద కలాన్ సర్పంచ్ దాడి నగేష్,ఉప సర్పంచ్ చింతపురి అనసూర్య,వార్డు సభ్యులు ఆవుల రాజన్న,కోట సుధాకర్,ఓరగంటి సంపత్,పాయబోయిన స్వప్న,రాంపెల్లి శ్రీనివాస్,మహిళా సంఘం సభ్యులు సుమారు 50మంది నేత్ర అవయవ దానానికి అంగీకారం తెలిపారు.ఈ కార్యక్రమంలో కోట కరుణాకర్ తన శరీర దానానికి ముందుకు రావడంతో ఆయనను శాలువతో సత్కరించి డోనర్ కార్డ్ అందజేసారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి హరిక్రిష్ణ,వెలుగు కో ఆర్డినేటర్ రాజనాల సుందరేష్,జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్ కుమార్,కోశాధికారి కొడిపెళ్లి గిరిప్రసాద్,గౌరవ సలహాదారులు సింగతి తిరుమల్ కార్యవర్గ సభ్యులు మోటపకుకుల అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు