పాఠశాలలను సందర్శించిన జిల్లా విద్యాధికారి.

మధ్యాహ్నభోజన రికార్డులను, గ్రంధాలయ నిర్వహణను, పరిశీలించారు.

పాఠశాలలను సందర్శించిన జిల్లా విద్యాధికారి.

అశ్వారావుపేట : లోకల్ గైడ్ : జనవరి 20 : 

కాంప్లెక్సు పరిధిలోని పేటమాలపల్లి, నాల్గవతరగతి ఉద్యోగుల కాలనీ ప్రాధమిక పాఠశాలలను జిల్లా విద్యాధికారిణి బి నాగలక్ష్మి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్ధుల సామర్ధ్యాలను ఎఫ్.ఎల్.యస్ నిర్వహణను, మధ్యాహ్నభోజన రికార్డులను, గ్రంధాలయ నిర్వహణను, పరిశీలించారు. విద్యార్ధులతో పాఠ్యాంశాలను చదివించి గణిత ప్రక్రియలపై ప్రశ్నలడిగి విద్యార్ధులు చెప్పిన సమాధానాలకు సంతృప్తి వ్యక్తం చేశారు. హాజరు శాతం పెంచాలని, వెనుకబడిన విద్యార్ధుల పై స్రత్యేక శ్రద్ధ వహించి వారి సామర్ధ్యాలను పెంపొందించుటకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించుకోవాలని అన్నారు.  ఉపాధ్యాయుల పనితీరు సంతృప్తికరంగా ఉందని అన్నారు. ఆమె వెంట ఎంపీడీవో అప్పారావు, ఎంఈఓ ప్రసాదరావు, కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత, సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు ఉన్నారు. ప్రభాకరాచార్యులు సంపాధకత్వంలో ప్రచురించిన బడిపిల్లల కథలు మధురోహలు పుస్తకాన్ని బహూకరించగా బాలాసాహిత్యాన్ని ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు