రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మిర్యాలగూడ వన్ టౌన్ ఏ ఎస్ ఐ శ్రీనివాస్
By Ram Reddy
On
మిర్యాలగూడ జనవరి 21
( లోకల్ గైడ్ తెలంగాణ)
కె ఎన్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మల్గిరెడ్డి భీమార్జున రెడ్డి అధ్యక్షతన ఎన్.ఎస్.ఎస్. యూనిట్ 1 2 ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు రోడ్డు భద్రత పట్ల అవగాహన పెంచుకొని ప్రమాదాల బారిన పడకుండా తమ ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజేసారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల ద్వారా అనేకమంది మృతి చెందుతున్నారు. కనుక ప్రతిఒక్కరు ఈ విషయాన్ని గమనించి రోడ్డు భద్రతా చర్యలను పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ, లైసెన్స్ లేకుండా వాహనాలను నడపవద్దని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మన అజాగ్రత్త వల్ల కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉందని, నేటి యువత అతి వేగంతో, బాధ్యతా రాహిత్యంతో వాహనాలను నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, కనుక హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది బాష్యానాయక్, గోపమ్మ, హుస్సేన్, సైదులు కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
03 Feb 2026 13:42:52
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
