వదంతులు నమ్మవద్దు
పౌర సరఫరాల అధికారులు
By Ram Reddy
On
నారాయణపేట మార్చి 25:
ప్రస్తుతం జిల్లాలో 44 పెట్రోల్ మరియు డీజిల్ బంక్ లు ఉన్నాయనీ తెలిపారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికా రులు బుధవారం పెట్రోల్ , డీజిల్ బంక్ లను పరిశీలించి న అనంతర దాదాపు 75 శాతం బంక్ లయందు పెట్రోల్ ,డీజిల్ నిల్వలు సరిపడినంతగా ఉన్నాయనీ తెలిపారు.. మిగతా 25శాతం పెట్రోల్ బంక్ యజమానులు డిడీలను ఆయిల్ కంపెనీ లకు చెల్లించి ఉన్నారనీ స్పష్టం చేశారు. ఆయిల్ టంకర్స్ ఈరోజు రాత్రిలోగా బంక్ లకు చేరుతుందని పెట్రోల్ బంక్ యజమానులు పౌర సరఫరాల శాఖ అధికా రులకు తెలియజేశారు. జిల్లా లో ఉన్న వినియోగదారులకు పెట్రోల్ డీజిల్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూసేలా అధికా రులు నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నారని అన్నారు.
ప్రస్తుతం జిల్లాలో 8 ఎల్పిజి ఏజెన్సీస్ ఉన్నాయని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు అన్నీ ఎల్పిజి ఏజెన్సీలను తనికి చేయడం జరిగినదన్నారు. అన్నీ ఏజె న్సీలలో సిలిండర్లు అందుబా టులో ఉన్నాయనీ తెలిపారు. అంతే గాకుండా జిల్లా యంత్రాంగం గ్యాస్ వినియోగదారులకు ఇబ్బంది జరుగకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలకు ఉపక్రమించి నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారితెలిపారు.వదంతులు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు.
ఫోటో రైట్ అప్:1.పెట్రోల్ బంక్ ను తనిఖీ చేసిన అధికారులు
_____________________
Tags:
About The Author
Latest News
06 Apr 2026 20:55:56
చర్ల : లోకల్ గైడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లం పరిధిలో ఉన్న ఆర్ కొత్తగూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచ్ తుర్రం రవికుమార్,...
