రైతుల ఆదాయం పెంచడం లక్ష్యంగా చర్యలు... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

సాగు లాభసాటి చేసేందుకు సహకార సంఘాలు కృషి పాల ఉత్పత్తి, చేపల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ రంగాలు ప్రోత్సహించాలి.

రైతుల ఆదాయం పెంచడం లక్ష్యంగా చర్యలు... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ 128వ మహాజన సభ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ఖమ్మం, మార్చి -25:లోకల్ గైడ్ :

రైతుల ఆదాయం పెంచడం లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.

బుధవారం నిర్వహించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ 128వ మహాజన సభ సమావేశంలో పిఐసి అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.

*పిఐసి అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ*  సహకార సంఘం ద్వారా అందించే వివిధ రకాల రుణాలను వినియోగిస్తూ రైతులు ఎలా ఆర్థికంగా మంచి స్థితికి చేరుకోవచ్చు అనే అంశంపై అవగాహన కల్పించడం కీలకమని  తెలిపారు. 

సాగు యాంత్రీకరణకు రుణాల పంపిణీ పెంచాలని, దీనివల్ల అధిక సంఖ్యలో పంట పండి రైతులకు లాభం చేకూరుతుందని కలెక్టర్ అన్నారు.

రైతులకు వ్యవసాయంతో పాటు పాడి పశువుల పెంపకం, చేపల పెంపకం వంటి వివిధ వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా ఆదాయం సంపాదించుకోవడంపై సహకార సంఘాలు ప్రోత్సహించాలని అన్నారు. 

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో రైతులకు సంబంధించి వివరాల నమోదులో  పొరపాట్లు జరగడం వల్ల రైతులకు నష్టం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ తెలిపారు. సహకార సంఘాలలో రైతుల వివరాలు నమోదు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రైతుల వివరాల నమోదులో జరిగిన పొరపాట్లను 15 రోజులలో సవరించాలని లేని పక్షంలో చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. 

రైతులకు మంజూరు చేసిన రుణాల రికవరీ పై వ్యవసాయ సహకార సంఘాలు దృష్టి సారించాలని, రైతులు స్వచ్ఛందంగా రుణాల చెల్లింపులు చేసేలా అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు ఉత్పత్తులు తయారు చేసే స్థాయికి చేరుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ అన్నారు. రైతులు బలోపేతం కావడం వల్ల మన సహకార సంఘాలు బలోపేతం అవుతాయని, లాభసాటిగా వ్యవసాయం మారుతుందని అన్నారు.

అంతకుముందు కలెక్టర్, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డిసెంబర్, 2025క్వార్టర్ అంతానికి సాధించిన ప్రగతి, వివిధ అంశాలలో బ్యాంక్ పురోగతి పై అధికారులతో సమీక్షించారు. పిఏసిఎస్ ల బలోపేతం, రైతుల సంక్షేమం దిశగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిడిఎం ఎల్. సుజిత్ కుమార్, టీఎస్ సిఏబి డిజిఎం కె. రవికాంత్ రెడ్డి, జిల్లా సహకార అధికారి జి. గంగాధర్, ఖమ్మం డిసిసిబి సిఇఓ వెంకట ఆదిత్య, భద్రాద్రి కొత్తగూడెం డిసిసిబి సిఇఓ శ్రీనివాస్, పిఏసీఎస్ అధ్యక్షులు,  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు 
-.

Tags:

About The Author

Latest News

అభివృద్ధే మా లక్ష్యం ప్రజల రక్షణే మాధ్యేయం  అభివృద్ధే మా లక్ష్యం ప్రజల రక్షణే మాధ్యేయం 
చర్ల : లోకల్ గైడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లం పరిధిలో ఉన్న ఆర్ కొత్తగూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచ్ తుర్రం రవికుమార్,...
ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల
విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం