అవసరమైతే తప్ప బయటికి రాకండి

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావులకోళ్ల నాగరాజ్ 

అవసరమైతే తప్ప బయటికి రాకండి

లోకల్ గైడ్, గండిపేట్: భారీ వర్షాలు  ఉన్న నేపథ్యంలో  ప్రజలు అత్యంత అవసరమైతే తప్ప  బయటికి రాకుండ  ఉండాలని బండ్లగూడ జాగీర్  మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్ నాగరాజు సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో  విద్యుత్ స్తంభాలకు  దూరంగా ఉండాలని, వాహనదారులు రోడ్డుపై  నెమ్మదిగా వెళ్లాలని బీజేఎంసీ ప్రజలకు తెలిపారు.  మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు, నిరంతరం పరిస్థితులను  ఎప్పటికప్పుడు  పర్యవేక్షించాలని  ఆయన కోరారు. అలాగే టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యవసర సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని అన్నారు.

Tags:

About The Author

Latest News