ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

బి విష్ణువర్ధన్ 

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

 లోకల్ గైడ్, గండిపేట్ : ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బి విష్ణువర్ధన్  అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ వట్టి నాగులపల్లి గ్రామ మాజీ వార్డు సభ్యులు విష్ణు అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాంటినెంటల్ హాస్పటల్   డాక్టర్లు వైద్య సిబ్బంది ద్వారా  వయోవృద్ధులకు బిపి, షుగర్ లెవెల్స్, వైద్య పరీక్షలు చేసి కావలసిన మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శిబిరం ద్వారా ఈ  కార్పొరేట్ ఆస్పత్రులలో  తక్కువ ఖర్చుతో కూడిన వైద్యం  అందించేందుకు ఆసుపత్రి డాక్టర్లు తెలిపారని ఆయన అన్నారు. ప్రజలకు ఇలాంటి వైద్య సేవలు చేయడానికి కృషి చేస్తామని విష్ణువర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంటినెంటల్ వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News