ఆరోగ్యకరమైన పిల్లలు ఆరోగ్యకరమైన దేశం" డాక్టర్ మురళి నాయక్ శాసనసభ్యులు
మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ ముఖ్య అతిది
మహబూబాబాద్ జిల్లా లోకల్ గైడ్ : మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ ముఖ్య అతిదిగా సోమవారం దామరవంచ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రత, సంక్షేమం కోసం అనేక కీలక కార్యక్రమాలను అమలు చేస్తోందని, ముఖ్యంగా గిరిజన గ్రామాలలో, జాతీయ నిర్మూలన కార్యక్రమం ద్వారా నిర్దిష్ట వ్యాధులను పూర్తిగా నిర్మూలించడం, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపు, ముందస్తు నిరోధక చర్యలను విస్తృతంగా అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది, ప్రజలు అందరూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ మాట్లాడుతూ,ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లో పిల్లలందరూ, పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో ఆల్బెండజోలు మాత్రలు ఇవ్వబడతాయని, ఒకటి నుంచి రెండు సంవత్సరాల వయసు గల పిల్లలకు సగం ఆల్బెండజోల్ మాత్రలు చూర్ణం చేసి అందించాలని, రెండు నుంచి మూడు సంవత్సరాల వయసున్న పిల్లలకు మాత్రమే చూర్ణం చేసి పరిశుభ్రమైన త్రాగునీటితో అందించాలని, మూడు సంవత్సరాలు కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు ఆల్బెండజోళ్ళు మాత్రమే సరిగ్గా నమిలి పరిశుభ్రమైన త్రాగునీటితో మింగాలని, ఆల్బెండజోల్ మాత్రమే ఇంటికి ఇవ్వరాదని పేర్కొన జరిగింది.
ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవడం వల్ల, పోషకాహార లోపం అధిగమించవచ్చని,రక్తహీనత భారం తగ్గుతుందని, కడుపునొప్పి,వికారం, వాంతులు విరోచనాలు, తగ్గించుకోగలుగుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ లక్ష్మీనారాయణ,డాక్టర్ సారంగం,స్థానిక వైద్యాధికారి డాక్టర్ యమునా, ట్రైబల్ వెల్ఫేర్ బాలుర ప్రిన్సిపల్ రమేష్, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్ కెవి రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, సూపర్వైజర్ కేఎల్ఎన్ స్వామి, గోపీచంద్, లో కియా, హెల్త్ అసిస్టెంట్ సర్దార్, ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
