సిఎంఆర్ఎఫ్ పేదలకు వరం.

- ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. - బాధిత కుటుంబానికి ఎల్‌ఓసీ అందజేత.

సిఎంఆర్ఎఫ్ పేదలకు వరం.

లోకల్ గైడ్/ తాండూర్:సీఎం సహాయక నిధి పేదలకు వరం అని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో, తాండూరు మండల పరిధిలో చెంగోల్ గ్రామానికి చెందిన గడ్డం సునీత ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5,00,000 ఎల్‌ఓసీ మంజూరు చేయించారు.ఈ  నేపథ్యంలో కుటుంబ సభ్యులకు  ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం సహాయక నిధిని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఎంతో ఆసరా ఇస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు మాధవి, పట్లోల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నిజామాబాద్ జిల్లా – చరిత్ర, భౌగోళిక విశేషాలు మరియు ప్రాముఖ్యత      నిజామాబాద్ జిల్లా – చరిత్ర, భౌగోళిక విశేషాలు మరియు ప్రాముఖ్యత    
నిజామాబాద్ జిల్లా త్రికూట, రాష్ట్రీకూట వంశాల పాలనను, నిజాం కాలపు వారసత్వాన్ని సాక్షిగా నిలిచిన భూమి. చారిత్రక కోటలు, దేవాలయాలు, జలాశయాలు, అరణ్యాలు, విద్యా సంస్థలు, మరియు...
ఘనంగా మాలకట్ట మైసమ్మ బోనాల పండుగ 
ఏడాది పాటు ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం
ఆరోగ్యకరమైన పిల్లలు ఆరోగ్యకరమైన దేశం" డాక్టర్ మురళి నాయక్ శాసనసభ్యులు
విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి..!!
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కుల పంపిణీ