ఈ సంవత్సరం 6 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి టార్గెట్

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఈ సారి 122 కోట్ల బడ్జెట్ కేటాయింపు

ఈ సంవత్సరం 6 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి టార్గెట్

33 జిల్లాలో 26,326 నీటివనరుల్లో 84.62 కోట్ల చేపపిల్లలు. 300 చెరువుల్లో 10 కోట్ల రొయ్యలు*  *జవాబుదారీ తనంతో కూడిన చేప పిల్లల పంపిణీ* *ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల వల్ల చేప పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది* *మట్టి గణపతులనే పూజించండి ప్రజలకి నా విజ్ఞప్తి* *కోహెడలో అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హోల్ సేల్ మార్కెట్* *గత ప్రభుత్వ హయాంలో చేప పిల్లల పంపిణీలో అవకతవకలు* *మీడియాతో యువజన, క్రీడా,డైరీ,పశుసంవర్థక,మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి*

 

 

 

 

 లోకల్ గైడ్:  - చేప పిల్లల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను గణనీయంగా పెంచటమే లక్ష్యంగా ఈ సంవత్సరం 6 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి చేయటమే లక్ష్యంగా మత్స్య శాఖ ముందుకు వెళ్తుంది అని పశుసంవర్థక,మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.గురువారం నాడు డా బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి క్యాబినెట్లోనే తెలంగాణ ప్రభుత్వం చేపల పెంపకానికి,మత్స్యకారుల జీవనోపాధి కల్పించే విధంగా మత్స్యశాఖ అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా 33 జిల్లాల్లోని 26,326 నీటివనరుల్లో93.62 కోట్ల రూపాయలతో 84.62కోట్ల చేప పిల్లలు,28.60కోట్ల రూపాయలతో 10 కోట్ల చేప పిల్లల పంపిణీకి చేప పిల్లల కోసం122 కోట్ల బడ్జెట్ కేటాయించడం సంతోషంగా ఉంది అన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి,మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదములు తెలిపారు.పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మత్స్యకారుల సంక్షేమం కోసం తన మొదటి సంతకం మత్స్యకారులకు 1.34 కోట్ల రూపాయల ప్రమాద భీమా పథకంపై చేశాను అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.టెండర్ పక్రియ త్వరలోనే ఉంటుంది.ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమం వల్ల ప్రత్యక్షంగా 4.21 మత్స్యకారులకి, పరోక్షంగా 10లక్షల మందికి జీవనోపాధి లభిస్తుంది.కేవలం చేప పిల్లల ఉత్పత్తి చేయడమే కాకుండా మార్కెటింగ్ చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మార్కెట్ ను రంగారెడ్డి జిల్లా కోహేడ ప్రాంతంలో 47.03 కోట్ల రూపాయలతో హోల్ సేల్ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నాం అన్నారు. కోహేడ మార్కెట్ శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఎగుమతులు పెరుగుతాయి అందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాం అని తెలిపారు.అంతకాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మార్కెట్లను శెరిగూడ (రంగారెడ్డి జిల్లా),ఆర్సపల్లి ( నిజామాబాద్ జిల్లా) ప్రాంతాల్లో 2 కోట్ల రూపాయలతో హోల్ సేల్ మార్కెట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టపోతున్నాం అన్నారు.ఇప్పటికే మహిళా సాధికారతలో భాగంగా సెర్ప్ సహకారంతో మహిళా సంఘాలకు వంటకాల తయారీ,మార్కెటింగ్ ఎలా చేయాలి శిక్షణా ఇచ్చి 35 మొబైల్ చేపల రిటైల్ అవుట్లెట్ అందించాం.గత 10 ఏళ్లలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో అనేక అవకతవకలు జరిగాయి. జవాబుదారీ తనంలేకుండా పోయింది.వీటిపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది.ఈ సారి ఏలాంటి లోటుపాట్లకి తావులేకుండా చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా జరిగేలా 6 అధికారులు,మత్స్య కారులు సంఘాల అధ్యక్షుడు,సభ్యులతో కూడిన కమిటీ పర్యవేక్షణలో 80 మిల్లిమీటర్ నుండి 100 మిల్లిమీటర్ సైజ్ చేప పిల్లల పంపిణీ జరుగుతుంది.ఈ కమిటీ నిరంతరం చేప పిల్లల ఎదుగుదలను పర్యవేక్షిస్తుంది.తద్వారా పక్కదోవ పట్టించేందుకు ఆస్కారం ఉండదు.అంతేకాకుండా చేప పిల్లల పంపిణీ సంబంధించి

పరిమాణం,ఎన్ని చేపలు,ఆ ప్రాంత సంఘం,షికం పరిణామం ఎంత,సంఘం అధ్యక్షుడు మొబైల్ నెంబర్ కనిపించే విధంగా చెరువుల వద్ద బోర్డు ఏర్పాటు చేస్తున్నాం.రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలి అని కోరుతున్నాను.ఈ పత్రికా సమావేశంలో మత్స్య శాఖ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి,మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు

 

 

 

*మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు*

 

గత 10 ఏళ్లుగా 30 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను నిర్వీర్యం చేశారు 

 

24 కోట్ల రూపాయలతో రూపాయలతో అన్ని కాలాల్లో నీటి సౌకర్యం ఉన్న చోట ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం 

 

తెలంగాణ చేప కొర్రమీను కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కరీంనగర్లో ఏర్పాటు చేయపోతున్నాం

 

100 కోట్ల బకాయిల పై విజిలెన్స్ ఎంక్వయిరీ జరుగుతుంది.కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తాం

 

నేచురల్ గా ఈ చేప పిల్లలు పెరుగుతాయి కేవలం కోర్రమీను జాతి చేపలకు మాత్రమే ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది

 

రిజర్వాయర్లో,చెరువుల్లో, సీజనల్ చెరువుల్లో ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్దారణ చేసిన తరువాత పంపిణీ ఉంటుంది....ఎలాంటి తప్పులకి తావు ఉండకుండా కమిటీ చర్యలు తీసుకుంటుంది

 

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను చెరువులో నిమర్జనం వల్ల చేప పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది

 

పర్యావరణం దెబ్బతింటుంది.కాబట్టి మట్టి గణపతులనే పూజించండి అని ప్రజలకి నా విజ్ఞప్తి

 

కెమికల్ ఫ్యాక్టరీల నుంచి రసాయనాల వెళ్లే చెరువుల దగ్గర జాగ్రత్తలు తీసుకుంటాం

 

కొత్త కమిటీ ఏర్పాటు అయ్యే వరకు పాత వారినే కొనసాగిస్తాం

 

చేప పిల్లల పంపిణీ జరిగేటప్పుడు మత్స్య కారుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది

Tags:

About The Author

Latest News