తండ్రి అడుగు జాడలలోనే ప్రజాసేవలో ముందుకు దూసుకు వెళ్లచున్న

యువ నాయకుడు బాలగౌని..సాయిచరణ్ గౌడ్

తండ్రి అడుగు జాడలలోనే ప్రజాసేవలో ముందుకు దూసుకు వెళ్లచున్న

పఠాన్ చేరు,లోకల్ గైడ్ ప్రతినిధి:

పఠాన్ చేరు నియోజకవర్గంలోని  మాత్రమే కాదు సంగారెడ్డి వరకు తన సేవాతత్త్వాన్ని విస్తరించి, ప్రజల గుండెలలో చోటు సంపాదించుకుంటున్న పేరు బాలగౌని సాయిచరణ్ గౌడ్. తన తండ్రి బాలగౌని రాములు గౌడ్ చూపించిన మార్గం ఆయనకు మార్గదర్శనం. చిన్ననాటి నుంచే తండ్రి రాజకీయాలు, ప్రజాసేవ పట్ల చూపిన నిబద్ధతను దగ్గరగా చూసి నాయకుడంటే ప్రజలతో కలిసిపడి, వారి కష్టాలలో అండగా నిలబడి, వారికి ఆశ్రయం ఇచ్చే వాడే అని సాయిచరణ్ తన మనసులో నమ్మకం ఏర్పరుచుకున్నారు.
ప్రజల సమస్యలు వింటూ అవి పరిష్కారం కావడానికి ముందుండి కృషి చేస్తూ ఎవరైనా కుటుంబంలో విషాదం ఎదురైతే వారితో పాటు నిలబడి ధైర్యం చెప్పి, ఆర్థిక సహాయం అందిస్తూ అంత్యక్రియలలో వ్యక్తిగతంగా పాల్గొని సంకట సమయంలో మన నాయకుడు మనతోనే ఉన్నాడు అనే భావన కలిగిస్తున్నారు. ప్రజలతో కలసి మెలసి తిరుగుతూ చిన్న సమస్యలకైనా వెంటనే స్పందిస్తూ అభివృద్ధి కోసం కృషి చేస్తూ సాయిచరణ్ గౌడ్ తనదైన ముద్ర వేసుకుంటు న్నారు. పఠాన్ చేరు, నియోజకవర్గంలోని ప్రాంతాల ప్రజలు ఒకే స్వరంతో చెప్పేది ఇదే నిజమైన 
ప్రజానాయకత్వం అని ప్రజల కోరిక.

Tags:

About The Author

Latest News

వరద బాధితులను ఆదుకొంటాం వరద బాధితులను ఆదుకొంటాం
కామారెడ్డి,లోకల్ గైడ్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల...
సర్వేపల్లి నూతన విగ్రహావిష్కరణ
కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేసిన జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ
సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి