డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు. తరలుతున్న ఎన్నికల సామగ్రిని దగ్గరుండి పరిశీలించిన జిల్లా కలెక్టర్.

పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి. పోలింగ్ శాతం నివేదికలను సమయానుసారంగా అందించాలి.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు. తరలుతున్న ఎన్నికల సామగ్రిని దగ్గరుండి పరిశీలించిన జిల్లా కలెక్టర్.

రేపటి పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి  వంద శాతం పోలింగ్ జరగాలి  పోలింగ్ ఉదయం 7 00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు

 లోకల్ గైడ్ తెలంగాణ కామరెడ్డి ప్రతినిధి 

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యం లో జిల్లాలో రేపు బుధవారం (11వ తేదీ) న జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రం లోని SP కార్యాలయం లోని AMC గోడౌన్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి, ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయని తెలిపారు.
పోలింగ్ ప్రక్రియ నిరంతరాయంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు ఎన్నికల సామగ్రిని సకాలంలో, సురక్షితంగా సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని సూచించారు.
ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన మౌలిక వసతులు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పోలింగ్‌కు సంబంధించి సిబ్బందితో పాటు ఎన్నికల సామగ్రిని బస్సుల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. విధులు నిర్వహించే అధికారులు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఎన్నికల అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ సామగ్రిని చెక్‌లిస్ట్ ఆధారంగా పరిశీలించుకోవాలని, పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న అనంతరం అవసరమైన అన్ని వస్తువులు తమ వద్ద ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని ఆదేశించారు. రిజర్వ్ కౌంటర్, స్పెషల్ కౌంటర్లలో పోలింగ్‌కు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, ఫారాలు, కవర్లు తదితర సామగ్రిని సరిచూసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో రిపోర్టింగ్ అనంతరం జోనల్ అధికారులు రూట్ వారీగా పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు పంపించడంలో సహకరిస్తారని తెలిపారు.
పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, పోలింగ్ ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుందని, పోలింగ్‌కు ముందు మాక్ పోలింగ్ నిర్వహించాలని సూచించారు.
పోలింగ్ విధులు నిర్వహించే అధికారులు తమ కేంద్రాలకు తరలి వెళ్లే సమయం నుంచి కౌంటింగ్ పూర్తి చేసి రిసెప్షన్ కేంద్రానికి చేరుకునే వరకు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
పోలింగ్ సిబ్బందికి అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతులు, బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

 *కామారెడ్డి* లో 49 వార్డులు 
152 పోలింగ్ కేంద్రాలు
పురుషులు 48389
స్రీలు.          50907
TG.                 17
మొత్తం.        99313

 *ఎల్లారెడ్డి* లో       12 వార్డులు,
పోలింగ్ కేంద్రాలు 24, 
పురుషులు.       6321
స్రీలు.                6943
TG.                         1
మొత్తం.         13265

 *బాన్సువాడ* లో 19 వార్డులు, 39 పోలింగ్ కేంద్రాలు
పురుషులు.    11578
స్రీలు.              12599
Tg.                       11
మొత్తం.          24188

 *బిచ్కుంద* 12 వార్డులు, పోలింగ్ కేంద్రాలు 24
పురుషులు.      6201  
స్త్రీలు.              6556
Tg.                       2
మొత్తం.         12759

 *గ్రాండ్ Total*         92 వార్డులు 
239 పోలింగ్ కేంద్రాలు 
పురుషులు.   72489
స్త్రీలు.          77005
ఇతరులు           31
మొత్తం.        149525
          
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధు మోహన్, ఆర్డీఓ వీణ, తహసిల్దార్ జనార్ధన్, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు
  లోకల్ గైడ్: జిల్లేడు చౌదర్ గూడ :   జిల్లేడు చౌదర్ గూడ మండలంలోని ఎల్కగూడ గ్రామపంచాయతీ బోయగూడ లో అభివృద్ధి పనుల్లో భాగంగా ఎమ్మెల్యే వీర్లపల్లి
ఇల్లందు మున్సిపాలిటి 20వ వార్డు కౌన్సిలర్ ఎండి జాఫర్ శాలువాతో ఘనంగా సన్మానించిన ఎన్ హెచ్ ఆర్ సీ ఆండ్ డబ్లూఈవో సభ్యులు
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు. డి ఐ ఈ ఓ దస్రు నాయక్. 
దినసరి కూలీలపై కనికరంలేనిఆర్టీసీ డ్రైవర్.
కారేపల్లి  ఎస్సీ  స్మశాన వాటిక సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ మేదరి టోనీ ( వీరప్రతాప్ )
గుడి నిర్మాణానికి భారీ విరాళం.
కొత్తూరు మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ సర్టిఫికెట్లు.