మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఎమ్మెల్యే నాయిని..

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ విడుదల...

మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఎమ్మెల్యే నాయిని..

జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్

IMG-20260210-WA0061హనుమకొండ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి10 లోకల్ గైడ్ :

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు..
మున్సిపల్ కమిషనర్‌తో కలిసి ఏర్పాట్ల క్షేత్రస్థాయి పరిశీలన – రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే..
హనుమకొండ,
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయంలో నిర్వహించనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 14 నుంచి 18 వరకు జరిగే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం నాడు జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, పోలీస్,  వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆలయ పరిసరాలను సందర్శించి, భక్తులకు అందించే సౌకర్యాలు, పారిశుధ్యం, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీటి వసతి, విద్యుత్ సరఫరా తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యూ లైన్ల ఏర్పాటు, పార్కింగ్ ప్రాంతాలు, భక్తుల రాకపోకల మార్గాలు వంటి విషయాలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకుని వేదమంత్రాల సాక్షిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు సమర్పించారు.
తదనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, వేయి స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి అత్యవసర సేవలను అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించామని, రవాణా, పోలీస్ శాఖల సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తుల భద్రత కోసం పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుందని పేర్కొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయడంలో భక్తులందరూ అధికారులకు సహకరించి, ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, డివిజన్ అధ్యక్షులు కుమార్ యాదవ్, సతీష్, ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ, ఆలయ ఈఓ అనిల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు
  లోకల్ గైడ్: జిల్లేడు చౌదర్ గూడ :   జిల్లేడు చౌదర్ గూడ మండలంలోని ఎల్కగూడ గ్రామపంచాయతీ బోయగూడ లో అభివృద్ధి పనుల్లో భాగంగా ఎమ్మెల్యే వీర్లపల్లి
ఇల్లందు మున్సిపాలిటి 20వ వార్డు కౌన్సిలర్ ఎండి జాఫర్ శాలువాతో ఘనంగా సన్మానించిన ఎన్ హెచ్ ఆర్ సీ ఆండ్ డబ్లూఈవో సభ్యులు
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు. డి ఐ ఈ ఓ దస్రు నాయక్. 
దినసరి కూలీలపై కనికరంలేనిఆర్టీసీ డ్రైవర్.
కారేపల్లి  ఎస్సీ  స్మశాన వాటిక సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ మేదరి టోనీ ( వీరప్రతాప్ )
గుడి నిర్మాణానికి భారీ విరాళం.
కొత్తూరు మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ సర్టిఫికెట్లు.