హర్ ఘర్ తిరంగా - హర్ ఘర్ స్వచ్ఛత కార్యక్రమం
స్వచ్ఛభారత్ వారి ఆదేశానుసారం హర్ ఘర్ తిరంగా - హర్ ఘర్ స్వచ్ఛత కార్యక్రమం మల్కాజిగిరిలో
మల్కాజిగిరి ,లోకల్ గైడ్ :స్వచ్ఛభారత్ వారి ఆదేశానుసారం హర్ ఘర్ తిరంగా - హర్ ఘర్ స్వచ్ఛత కార్యక్రమం మల్కాజిగిరిలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్
జకియా సుల్తానా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో మల్కాజిగిరి బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నుండి మల్కాజిగిరి చౌరస్తా జడ్పీహెచ్ పాఠశాల వరకు సుమారు 500 మంది విద్యార్థిని విద్యార్థులతో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీ జకియా సుల్తానా మాట్లాడుతూ.. ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించుటకై
ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు మల్కాజిగిరిలో సంపూర్ణ పారిశుధ్య నిర్వహణకై అనేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఉదయం 6:30 గంటలకు 141 గౌతంనగర్ డివిజన్ సంబంధించిన స్వచ్ఛ ఆటో టిప్పర్ డ్రైవర్లు, మల్లికార్జున నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసి యేషన్ వారితో కలిసి డివిజన్ లో చెత్త సేకరణ పై అనేక విషయాలు చర్చించి, లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు పోవాలని అనుకున్నామన్నారు. ప్రతి ఇంటి నుండి తప్పని సరిగా చెత్త సేకరణ జరగాలని, అధిక డబ్బులు అడగరాదని ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే వారితో మాట్లాడి అదనంగా డబ్బులు అడగాలని స్వచ్ఛ ఆటో టిప్పర్ డ్రైవర్లకు తెలిపారు. స్వచ్ ఆటో టిప్పర్ డైవర్ తన పరిధిలో జీవిపీలు బహిరంగ చెత్త ప్రాంతాలు ఉన్నట్లయితే వాళ్ల పనితీరు బాగా లేనట్టే అన్నారు. దీనికి స్వచ్ఛ టిప్పర్ తన పరిధిలో ఎక్కడ కూడా జీవిపి లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే స్వచ్ఛతపై తమ కుటుంబ సభ్యులచే స్వచ్ఛత పాటించేలా విద్యార్థినీ విద్యార్థులు చొరవ చూపాలని, విద్యార్థులు సహకారం ఎంతో అవసరమన్నారు. దోమల ఉత్పత్తి జరగకుండా ఫ్రైడే - డ్రై డే ను పాటిస్తూ దోమల నివారణ కూడా అరికట్టాలని, పరిసరాల పరిశుభ్రతతో పాటు దోమల నిర్మూలన జరిగితేనే ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఉపవైద్యాధికారిణి
డాక్టర్ కె మంజుల
మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులకు మాత్రమే చెత్తను అందించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయరాదని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా స్వచ్ఛ ఆటో టిప్పర్ డ్రైవర్ కు చెత్తని ఇవ్వని ఇండ్లను గుర్తించి, ఎరుపు రంగుతో మార్క్ చేయాలని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కొన్ని ప్రాంతాలలో ఎరుపు రంగు మార్క్ ఎందుకు వేయయడం లేదని అడిగారు. మిషన్ స్వచ్ఛభారత్ యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరి లో హర్ ఘర్ తిరంగా- హార్ ఘర్ స్వచ్ఛత ర్యాలీ సుమారు 500 మంది విద్యార్థిని విద్యార్థులతో కలిసి విజయవంతంగా జరిగిందన్నారు. అందుకు సర్కిల్ పారిశుద్ధ్య విభాగం వారిని అభినందించారు.
ఈ సందర్భంగా పేకో మాత్ ఎన్జీవో ఆర్గనైజేషన్ జ్యోతి, మేధా వారు పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్,మిషన్ స్వచ్ఛభారత్ సంపత్ రెడ్డి, ఎంటమాలజిస్ట్ వనజ, శానిటరీ జవాన్ లు, ఎస్ ఎఫ్ఏలు నర్సింగరావు, ఎల్లయ్య, రాములు, శేఖరయ్య, గిరి, అలినవాజ్, లక్ష్మీబాయి, అంజయ్య, జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు
About The Author
