పచ్చని చెట్లను పెంచూదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం కాళోజి వాకర్స్ అసోసియేషన్
మహాబూబాబాద్ జిల్లా లోకల్ గైడ్ న్యూస్ ఆగస్టు 9
మహాబూబాబాద్ జిల్లా పచ్చని చెట్లను పెంచూదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
రాఖీ పౌర్ణమి సందర్భంగా కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియంలో పచ్చని చెట్లను పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో చెట్లకు రాఖీలు కట్టారు.ఈ సందర్భంగా కాళోజి వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు నామిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ చెట్లను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చెట్లే సకల ప్రాణులకు జీవనాధారం అని కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ సలహాదారు మైస నాగయ్య, పెద్ది వెంకన్న, గోనే శ్యాంరావు, దేవేందర్ రెడ్డి, వేల్పుల రవీందర్, కోడెం శ్రీనివాస్, జి వెంకటేశ్వర్లు, దామోదర్ వెంకన్న, మల్లేష్, పగడయ్య, సామ సత్యం, బిక్షం, రఫిక్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
