రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన
సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
By Ram Reddy
On
లోకల్ గైడ్ సత్తుపల్లి
హైదరాబాద్, తాజ్ కృష్ణా రాజ్యసభ సభ్యులుగా నూతనంగా ఎన్నికైన గౌరవనీయులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో జరిగిన ఈ భేటీలో, ఇతర సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆమె నరేందర్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు మాట్లాడుతూ, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వేం నరేందర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన తన పదవీ కాలంలో ప్రజల గొంతుకను పార్లమెంటులో బలంగా వినిపిస్తారని, రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తారని ఆకాంక్షించారు.
Tags:
About The Author
Latest News
06 Apr 2026 20:55:56
చర్ల : లోకల్ గైడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లం పరిధిలో ఉన్న ఆర్ కొత్తగూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచ్ తుర్రం రవికుమార్,...
