రోడ్డు భద్రతపై కురవి పోలీసుల దృష్టి ఎస్ఐ గండ్రాతి సతీష్

డ్రైవర్లకు కంటి పరీక్షలు, అద్దాల అందజేత...

రోడ్డు భద్రతపై కురవి పోలీసుల దృష్టి ఎస్ఐ గండ్రాతి సతీష్



 లోకల్ గైడ్ ప్రతినిధి మహబూబాబాద్ 

మహబూబాబాద్ జిల్లా కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని  ఎర్రివే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్.ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టి,ఆటో డ్రైవర్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 22 మంది ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో 13 మందికి చూపు మందగించినట్టు గుర్తించారు. వైద్యుల సూచనల మేరకు వారికి సుమారు రూ.13,000 విలువైన 13 కంటి అద్దాలను కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో అందజేశారు.
డ్రైవర్లు స్పష్టంగా చూడగలిగేలా చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. ఈ చర్య డ్రైవర్లతో పాటు ప్రయాణికుల భద్రతకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
తమ భద్రతపై చొరవ చూపుతున్న జిల్లా ఎస్పీ  కురవి పోలీసులకు స్థానిక ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో కురవి ఆటో యూనియన్ అధ్యక్షుడు కాట్ర్యల వీరన్న, ఉపాధ్యక్షుడు గుగులోత్ రవి, కార్యదర్శి మాలోత్ వీరన్నతో పాటు శ్రీరామ్ అశోక్, కానుగంటి రాజు, పీసీ కాశీరం, డబ్ల్యూపీసీ అనిత తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అభివృద్ధే మా లక్ష్యం ప్రజల రక్షణే మాధ్యేయం  అభివృద్ధే మా లక్ష్యం ప్రజల రక్షణే మాధ్యేయం 
చర్ల : లోకల్ గైడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లం పరిధిలో ఉన్న ఆర్ కొత్తగూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచ్ తుర్రం రవికుమార్,...
ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల
విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం