భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
హనుమకొండ జిల్లా (లోకల్ గైడు):
భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం తెలిపారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత శాఖలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో అప్రమత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్ 7981975495 ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు తమ, తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
About The Author
