మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నివాసంలో రాఖీ సంబరాలు
మర్పల్లి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా, లోకల్ గైడ్:
వికారాబాద్ జిల్లా బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నివాసంలో రాఖీ పౌర్ణమి సంబరాలు ఘనంగా జరిగాయి. మర్పల్లి బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి కి మాజీ ఎమ్మెల్యే సతీమణి సబితా రాఖి కట్టి అనురాగ బంధాలను పటిష్టం చేసి శ్రేయస్సు కోరుతూ అతని కుడి చేతికి రక్ష కంకణాన్ని రాఖి కడుతుంది
రక్షాబంధనం అనేది శ్రావణ మాసంలో వచ్చే పవిత్రమైన పండుగ ఇది సోదర సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమానురాగాలను, అనురాగ బంధాలను పటిష్టం చేసే ఒక గొప్ప వేడుక సోదరి తన సోదరుడి క్షేమం, సంతోషం, శ్రేయస్సు కోరుతూ అతని కుడిచేతికి రక్షా కంకణాన్ని (రాఖీ) కడుతుంది.
వేడుక విధానం సోదరి తన సోదరుడికి నుదుట తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, తీపి తినిపిస్తుంది. ఇది ఆమె ప్రేమను, రక్షణ భావనను వ్యక్తపరుస్తుంది. 'వ్రతోత్సవ చంద్రిక' గ్రంథం ప్రకారం, సోదరుడి కుడిచేతికి రాఖీ కట్టడం శుభప్రదం అన్నారు.అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ. సోదర సోదరీమణుల ఆత్మీయ బంధాన్ని చాటే ఈ వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ ఆత్మీయ సోదరీ సోదరీమణులకు మిత్రులకు మరియు బంధువులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.
About The Author
