నాగరంజిత్ కు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే అభినందనలు

నాగరంజిత్ రాష్ట్రస్థాయి ప్రధమ బహుమతి సాధించిన విషయం పాఠకులకు విదితమే.

నాగరంజిత్ కు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే అభినందనలు

 

అశ్వారావుపేట, లోకల్ గైడ్ : 

రాష్ట్రస్థాయిలో హైదరాబాద్ లోని దోమల్ గూడ వ్యాయామ కళాశాలలో ప్రత్యేక అవసరాల విద్యార్ధులకు జరిగిన ఆటల పోటీలలో 50 మీటర్ల రన్నింగ్ లో అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధి నాగరంజిత్ రాష్ట్రస్థాయి ప్రధమ బహుమతి సాధించిన విషయం పాఠకులకు విదితమే. ఈ సందర్భంగా అశ్వారావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ  పాఠశాలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అబినందించి సత్కరించారు. విద్యార్ధి శిక్షణ అవసరాల నిమిత్తం రెండువేల రూపాయలు బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధి ప్రత్యేక అవసరాలు కలిగి ఉన్నప్పటికీ వైకల్యం దేనికీ అడ్డుకాదని నిరూపిస్తూ ప్రధమస్థానంలో నిలబడడం గర్వించదగిన విషయమని ఈ విషయంలో విద్యార్ధులను తీర్చిదిద్దుతూ అన్ని రంగాల్లో పాఠశాలను అభివృద్ధి చేస్తూ ఉపాధ్యాయులను సమన్వయ పరుస్తూ విద్యార్ధులను తీర్చిదిద్దుతున్న ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అభినందనీయులని అన్నారు. అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుటకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పాఠశాలలో ఆడిటోరియం నిర్మిస్తామని విద్యార్ధులు క్రీడల్లో రాణించే విధంగా అశ్వారావుపేటలో క్రీడామైదానం పనులు జరుగుతున్నాయని, దొంతికుంట పార్కును అందంగా తీర్చిదిద్దుతామని, ఎకోపార్క్  ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని పాఠశాల ఎదురుగా ఇబ్బంది లేకుండా సిసి రోడ్ ను నిర్మాణానికి శంకుస్థాపన చేశామని విద్యార్ధులంతా చదువులో రాణించి ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోద మండల విద్యాధికారి పి ప్రసాదరావు, పాఠశాల ప్రధానోపాధ్యయురాలు హరిత, పాఠశాల ఉపాధ్యాయులు, సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం