అన్ని దానలలో అన్న దానం గొప్పది.
అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని రామగిరి
రామాలయం మాజీ డైరెక్టర్ యాట జయాప్రద రాంరెడ్డి పేర్కొన్నారు.స్వచ్ఛంద సంస్థలతో పాటు నల్గొండ లయన్స్ ఫ్రీ ఫౌండేషన్ చేపడుతున్న అన్నదానం కార్యక్రమంలో ఔత్సాహికులు ఇతోధికంగా తోడ్పాటు నందించాలని ఆమె కోరారు.శుక్రవారం రోజున యటా జయప్రద రాంరెడ్డి,ఊట్కురి సురేందర్ రెడ్డి,అంశమ్మ దంపతుల కుమారుడు,కుమార్తె యాట దినేష్ రెడ్డి,సౌమ్యా రెడ్డి నాలుగవ వివాహా వార్షికోత్సవం తో పాటు వారి మనుమరాలు చిరంజీవి యాట హాన్వీక రెడ్డి జన్మదినోత్సవాని పురస్కరించుకుని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో "నల్గొండ లయన్స్ ఫ్రీ ఫౌండేషన్" ఆధ్వర్యంలో శుక్రవారం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జయప్రదా రెడ్డి మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి చికిత్సల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలి వచ్చే వారికి వారి వెంట వచ్చే బందువులకు నల్లగొండ లయన్స్ ఫ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం అనిర్వచనీయమైనదని ఇందుకు ప్రతీ ఒక్కరూ చేయూత నందించాలని ఆమె విజ్నప్తి చేశారు.
ఈ కార్యక్రమంలోనల్గొండ లయన్స్ ఫ్రీ ఫౌండేషన్ నిర్వాహకులతో పాటు యాట రాంరెడ్డి,ఊట్కురి సురేందర్ రెడ్డి,అంశమ్మ తదితరులు పాల్గొన్నారు.
